On Mon, Oct 3, 2022, 8:29 AM EVVSV PRASAD <prasaderanki4@gmail.com> wrote:
నూతన దసరా పాటరచన : E.V.V.S. వర ప్రసాద్, తుని.*******************************పల్లవి :దసరా పండుగే వచ్చింది మనకుసరదాలు ఎన్నిటినో తెచ్చింది మాకుపిల్లలము మేమంత కలిసి వచ్చాముమీ ఇంట పండగే తీసుకొచ్చాముచరణం (1)రారండి! రారండి! అమ్మలారా! మీరు!బాలలం వచ్చాము మీ వాకిటున్నాముపాటలను చక్కగా పాడతామండి!గంతులే ముచ్చటగ వేస్తాము లెండి!దైవమును భక్తితో ప్రార్ధించుతాము!శుభములే ఇమ్మని కోరెదము మేము!చరణం (2)వరలక్ష్మి తల్లీ! దయ చూపవమ్మా!సిరులను గొనితెచ్చి అందించవమ్మా!హంసవాహిని నీవు! పలుకుమోయమ్మ !చదువులు చక్కగ సాగనీయమ్మా!కనకదుర్గా మాత! కరుణజూపమ్మా!కష్టములు పోగొట్టి కాంతి నింపమ్మా!చరణం (3)శంకరా! ఈశ్వరా! శంక లొద్దయ్యా!శుభములే మాయింట కలిగించవయ్యా!రావయ్య! రావయ్య! చిలిపి కన్నయ్యా!మహిమలే చూపించి మురిపించవయ్య!దేవతలు అందరూ కదిలి రారయ్యా!దర్శనము మాకిచ్చి దీవించరయ్యా!చరణం (4)చాక్లెట్లు, బిస్కట్లు, మాకు పెట్టండిఎభైలు, వందలు గురులకివ్వండిపిల్లలుంటే ఇల్లు కళకళ లాడేనుఒజ్జలుంటే జాతి వృద్దిలో కొచ్చేనుజయీ భవ! జయ విజయీ భవ!జేజేలు మాతా! జై భారత మాతా!*******************************✍️ రచనE.V.V.S. వర ప్రసాద్,తెలుగు ఉపాధ్యాయుడు,ఊరు : తుని.జిల్లా : తూర్పు గోదావరిచరవాణి : 8019231180