శీర్షిక:విడవని వాన
వాన నేడో పిలవని అతిదయింది
ఎదురుచూపులసలే లేవిపుడు
కప్పలకు పెళ్ళిచేయకుండానే
నిండుగా కురిస్తున్నది
వచ్చిన చుట్టం ఇడిసిపోనట్టు ముసురురాగం ఆలపిస్తున్నది
అవనిపై నాడందరు ఎదురుచూసెటోళ్ళు
ఒక్కజల్లుతో రైతన్నలు నాగళ్ళతో పరుగుతీసేటోళ్ళు
గింజలు పిందెలై పచ్చని పంటలైయ్యేవి
ఎందుకో నేడైతే ఆగనిపొగరునద్దుకుని
వస్తేపోనంటుంది
కాలువలు చెరువులు నిండుకుండలైనవి
జీవనగమనాన్ని బందిస్తూ
ఆగమాగమయితుంటే
ఆనందిస్తున్నట్లున్నది
జనాలనంతా పరేషాన్ చేస్తూ
తన హుషారుతో
బతుకును బేజారు చేస్తున్నది
బడుగుజీవుల బతుకునంతా చిత్రవధ చేస్తున్నది
భయాన్నంతా లోకమంత నింపుతున్నది
సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.