సాటిలేని శాస్త్రజ్ఞుడు"కలాం"-గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

సాటిలేని శాస్త్రజ్ఞుడు"కలాం"-గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

సాటిలేని శాస్త్రజ్ఞుడు"కలాం"
------------------------------ 
సాటిలేని శాస్త్రజ్ఞుడు
మచ్చలేని మహాత్ముడు
సాంకేతిక రంగంలో
దేశ కీర్తికి కారకుడు

రామేశ్వరంలో పుట్టెను
మన రాష్ట్రపతి ఆయెను
అత్యుత్తమ సేవలతో
భారతరత్న గైకొనెను

"మ్యాన్ ఆఫ్ మిస్సైల్ " గానూ
పేరొందిన మహా ఘనుడు
దేశానికంకితమైన
అసాధారణ మానవుడు

మానవతా మూర్తి కలాం
వారికి శిరం వొంచి సలాం
"ఏ. పి.జె. అబ్దుల్ కలాం"గారు
భారతమ్మకు నిజ గులాం

-గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments