'పర్ణశాల' బాలగేయాలు పుస్తకావిష్కరణ
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న రచించిన 23వ పుస్తకం 'పర్ణశాల' బాలగేయాల సంపుటి SEIF చైర్మన్ డా.ఈదా శామ్యూల్ రెడ్డి , IAS శ్రీ అద్దంకి శ్రీధర్ బాబు ,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,టొబాకో బోర్డ్,ఆ.ప్ర ,డా.SH. కులకర్ణి, SHK వెల్నెస్ అకాడమీ చైర్మన్ మరియు ప్రొ. విశ్వనాథం మాస్టర్ గారుల చేతుల మీద ,గుంటూరులో ఆవిష్కరించారు.అనంతరం అచిరకాలంలో 23 పుస్తకాలు ప్రచురించడమే కాకుండా,బాలసాహిత్యంలో విశిష్ట సేవలకు గానూ గద్వాల సోమన్నను ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీత,రచయిత గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు ,శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.