సుభాషితాలు
------------------------------
అదుపులేని జీవితము
అవుతుంది నాశనము
దిద్దుకున్న తక్షణము
భవితయగును సురక్షితము
పొదుపులేని కుటుంబము
శిథిలావస్థ భవనము
అభివృద్ధికి బహు దూరము
చివరికది పెను భారము
నెమ్మది లేని హృదయము
ఘోషించే సాగరము
అన్పించును నిస్సారము
కన్పించును ఇల నరకము
ఆవరిస్తే బద్దకము
ఆనందం మటుమాయము
బ్రతకంతా శూన్యము
వదిలివేస్తే ! క్షేమము
-గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.