తంగేడు పూల తరుణీ కోల్..
తనువంతా పసుపు కోల్..
పూల చెలియల మధ్యా కోల్..
పులకరించె గౌరు కోల్..
ఉద్యమానికి ఊపిరిచ్చే కోల్..
తెలంగాణ ఇలవేల్పు కోల్..
తెలంగాణ ఇలవేల్పూ కోల్..
కరుణాలతల్లీ కోల్..
పుడమితల్లి పైన కోల్..
పూజలందుకునే కోల్..
తీరొక్క పూలతో తల్లీ కోల్..
అందంగా పూసిందీ కోల్..
తంగేడు పూల తరుణీ కోల్..
తనువంతా పసుపు కోల్..
పూల చెలియల మధ్యా కోల్..
పులకరించె గౌరు కోల్..
మందార సీతజడలు కోల్..
నుదుటి బొట్టోలే కోల్..
రామబాణం పూలు కోల్..
రమణీయంగా మెరిసే కోల్..
మూడంతరాలలో కోల్..
గౌరమ్మ నిలిచే కోల్..
వీధివీధుల్లోనా కోల్..
పండగ సంబరమే కోల్..
వాడవాడల్లోనా కోల్..
ఆనందపర్వమే కోల్..
తంగేడుపూల తరుణీ కోల్..
తనువంతా పసుపు కోల్..
పూల చెలియల మధ్యా కోల్..
పులకరించె గౌరు కోల్..
గుడికాడ బతుకమ్మ కోల్..
బడికాడ బతుకమ్మ కోల్..
కోటి కాంతులన్నీ కోల్..
బతుకమ్మ చుట్టూరా కోల్..
కోలాటమాడేను కోల్..
కోమలాంగులంతా కోల్..
సీతాకోకచిలుకల్లే కోల్..
రెపరెపలాడిందీ కోల్..
తంగేడుపూల తరుణీ కోల్..
తనువంతా పసుపు కోల్..
పూల చెలియల మధ్యా కోల్..
పులకరించె గౌరు కోల్..
ముత్తైదువులంతా కోల్..
ముద్దుగుమ్మలంతా కోల్..
బతుకమ్మ చుట్టూరా కోల్..
బంతి గూడాడెను కోల్..
ముద్దపప్పు బతుకమ్మ కోల్..
మూడోనాడంటా కోల్..
పప్పుముద్ద బెల్లం కోల్..
వాయనమందేనూ కోల్..
నోరుతీపి తోటి కోల్..
నవ్వుల కిలకిలలు కోల్..
సిరిల సీతాకోకలు కోల్..
సంబరాల సంతోషీలు కోల్..
తంగేడుపూల తరుణీ కోల్..
తనువంతా పసుపు కోల్..
పూల చెలియల మధ్యా కోల్..
పులకరించె గౌరు కోల్..
శ్రీలతరమేశ్ గోస్కుల
హుజురాబాద్.