రామరావణ గాథ
దేవతల వేడుకోలు తోడ ఇంద్రుని రాజ్యకాంక్ష తోడ
ఋష్యశృంగ పుత్రకామేష్టి తోడ
జనియించె నట విష్ణువు దశరథుని ఇంట
బ్రహ్మ వరమొందిన మునికుమారు రావణబ్రహ్మ జంప
రాముని కొరకే లక్షలాది వానర సైన్యం సృష్టించ బడిన గాథ
ఆశ్రమవాస మంచు అడవులంజేరి
లోక కళ్యాణమంచు క్రతువుల తరువులంబెరికి
ఆది వాసుల జీవనము జెరిచి
అడ్డగించు నన్నదమ్ముల నిర్మూలింప దలచి
రామలక్ష్మణుల నెక్కుపెట్టె విశ్వామిత్రు గాథ
మాయావితో యుద్ధాన అన్న జినిపోయెనని యెన్చిన
సూర్యపుత్ర సుగ్రీవుతో జేరి
ఇంద్రతనూజు వాలి జంపె ఇనకులతేజు గాథ
తోబుట్టును వదిలి పరుల జేరి పట్టాభిషిక్తుడైన విభీషణుని గాథ
రామాయణ రణమందే యన్నదమ్ములు నిల్చిరి రామలక్ష్మణులు దప్ప
అతివ నాసికా కర్ణంబుల ఛేదించిన లక్ష్మణ
రాక్షసంగా దెచ్చిన పరస్త్రీని తాకని రావణ
ఆలిని అగ్నిప్రవేశమొనర్చి అడవుల కంపిన రాము
అన్నదమ్ముల అనుబంధం తండ్రి కొడుకుల ఆప్యాయత
అన్నాచెల్లెల్ల అనురాగమే కదా ఈ రామరావణ గాథ
- రాజేంద్ర
9010137504