"ఆంధ్ర కేసరి సేవారత్న" అవార్డు సోమన్నకు ప్రదానం మరియు "గుణింత గేయాలు" పుస్తకావిష్కరణ.
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్నను 'ఆంధ్ర కేసరి సేవారత్న' అవార్డు వరించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకోవడమే కాకుండా అచిర కాలంలోనే దాదాపు 22 పైగా పుస్తకాలు వ్రాసి,ముద్రించి తన ప్రతిభను చాటుకున్నారు.గణితో పాధ్యాయుడైనా తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా బాలసాహిత్యంలో గద్వాల సోమన్న విశేష కృషి చేసినందులకుగాను వీరి ప్రతిభను గుర్తించి ,"ఆంధ్ర కేసరి"టంగుటూరు ప్రకాశం పంతులు, మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి జయంతిని పురస్కరించుకుని "అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థ,ఆదరణ వెల్ఫేర్ సొసైటీ"' మార్కాపురం వారిచే,ఈ సంస్థ చైర్మన్ శ్రీ గొట్టేముక్కల చెన్నకేశవులు మరియు ఉభయ రాష్ట్రాల యం.బి.సి గౌరవ అధ్యక్షులు డా. ఆకుమళ్ళ నాని గారులు ఈ అవార్డు ను అందజేశారు. అనంతరం గద్వాల సోమన్న రచించిన"గుణింత గేయాలు" 21వ, పుస్తకాన్ని ఆవిష్కరించారు.అవార్డు గ్రహీత గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు ,శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.