ప్రచురణ కొరకు

ప్రచురణ కొరకు


అంశం:- 75 వ స్వాతంత్ర్య  వజ్రోత్వవాలు -  రైతుల కష్టాలు 
 శిర్షిక:- కష్టాన్ని నమ్ముకొని నష్టాలతో సేద్యం చేస్తున్న                     
               రైతుని.....
వ్యవసాయానికి మించిన సాయం ఉండదు..
కానీ రైతులని నేడు నిస్సహాయకులుగా చేస్తున్నరు..
నేనొక రైతు బిడ్డని... 
మా నాయిన చేస్తున్న ఎవుసాన్ని అనుకరిస్తూ...
 వ్యవసాయంపై ప్రేమను కలిగి.....
సేద్యానికి నడుం కట్టీన యువ రైతుని..
నా కాడెడ్లతో దుక్కి దున్ని.. విత్తనాలను జల్లి...
పుడమి తల్లి ఆశీర్వాదం కోసం...
 పరితపిస్తున్న పేదింటి బిడ్డని... కానీ...

వరుణ దేవుడు ఆలస్యం చేసి..
నన్ను అయోమయంలో పడేసిన...
మా పొలములో.. అగాగి పోసే బోరు మోటర్..
దాన్ని ఆన్ చెయ్యడానికి.. పోతే. కరెంటు సమస్యలు..
అన్నింటినీ అధిగమించి..
ఆరుగాలం కష్టము చేసి.....
పండించిన పంటను అంగడికి తీసుకుపోతే....
అగ్గువలో అన్ని కొనే.. భేరగాల్లు...
కాబట్టి.....
నా లాంటి అన్నదాత కావలసింది ఎన్ని ' కల' హామీలు కాదు.  
నేను పండించే పంటకు కావాలి మద్దతు ధర..
అప్పుడే నా ఇంట సిరుల పంట..
గట్ల అయితేనే అయితుంది గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం....
వస్తుంది.... రైతుల రాజ్యం.....
మీ. మట్టపల్లి రమేష్
మాడుగుల,రంగా రెడ్డి జిల్లా
9490807729
ఉమ్మడి పాలమూరు

0/Post a Comment/Comments