గణుపతి
హితం చేయుట
దైవత్వం
ఏ ప్రాణికి హాని చేయకుండుట
ఆధ్యాత్మిక సోపానం
పంచభూతాలు నీవు సృష్టించలే
జననం నుంచి ప్రతి గమనం
పుట్టుక నుండి పాడే వరకు
పంచభూతలపై ఆధారపడుతావు
రంగుల రసాయనాల
మిశ్రమాల తో తాగు నీరు
ప్రాణ దారం అయిన చెరువు
చేస్తున్నావు కలుషితం
జలం పై ఆధారపడ్డ జీవులు
అస్తిత్వా0 లేకుండా చేస్తున్నావు
మన దేహం అశాశ్వతమైన ది
9 రోజుల్లో నిమజ్జనం చేసే
గణపతి కి మనసులో
ప్రతిష్టించు
సర్వేజనో సుఖినోభావంతు
ఓం శాంతి:ఓం శాంతిః అనే
మాటకు దూరం
ఎత్తులు కాదు హృదయపూర్వక నివేదన ప్రమాణం
అచెంచాల మైన భక్తికి
నిచ్చమైన హృదయం తో
ప్రార్థనలు అవశ్యం
గణపతి ఒక ప్రకృతి
పుట్టిన వాడు గిట్టక
తప్పదు
పూజలోను ఉపయోగించే
21 ఆకులు ఈ పూడిమి
ఇచ్చింది
ఎలుక ను కూడా ప్రేమించు
తల్లిదండ్రుల అభిమానాన్ని
చూరగొన్న వినాయకుని
తత్వమే దైవత్వం
భూతల్లి శోకం అవ్వడం
జల తల్లి దుఃఖం అవ్వడం
న్యాయమా
శాస్ట్రియత ఇమిడి ఉన్న
మట్టి తో ప్రతిమలు చేద్దాం
పంచభూతాలు పవిత్రతను
చేతుల్లో చూపుదాం
లోతైన మనుసు తో అలిచించు
ప్రతి వ్యక్తిలో పరమాత్మ ఉన్నప్పుడు
ఆ పరమాత్మ కు ఉపాయోగపడే పంచభూతాలు
ఉత్సవాల పేరుతో అపరిశుభ్రం
చేస్తే పూజ పరమార్ధం
నిరార్ధకం
అందుకే పర్యావరణం
ప్రకృతి దైవత్వం దాగి ఉంది
అందుకే మట్టి వినాయకుడు
చింత వద్దు భక్తి తో
ముక్తి ముద్దు
ఓం గం గణపతేయ నమః
ఉమ శేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి