Pravahini

చిటికెనకు "తెలుగుకూటమి"
ఆహ్వానం 
======================

తెలుగు కూటమి వ్యవస్థాపకులు పారుపల్లి కోదండరామయ్య పర్యవేక్షణ లో  ప్రతిష్టాత్మకంగా జరిగే అంతర్జాతీయ అంతర్జాల ( జూమ్ ) సమావేశ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా  యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్వ అధ్యక్షులు, ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి  కే. యస్. చలం హాజరుకాగా మన దేశం నుండి  తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్  ఫౌండేషన్ సభ్యుడు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిటికెన మాట్లాడుతూ 
తెలుగు భాష పరిరక్షణ కోసం, భావితరాలకు తెలుగు భాషను ఒక క్రమపద్ధతిలో అందజేసే  ఉద్యమంలో భాగంగా తెలుగు వారు ఎక్కడ ఉన్నా    కలిసికట్టుగా కృషి చేయాలని,  తెలుగు భాష  పరిరక్షణ,మనుగడ కోసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన  పర్యవేక్షకులు పారుపల్లి కోదండ రామయ్య కు మరియి పాల్గొన్న పలు దేశాల ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.కార్యక్రమంలో సంస్థ స్థాపకులు కోదండరామయ్య,నిర్వాహకులు  కోదాటి అరుణ మరియు స్వీడన్ , ఆఫ్రికా, సింగపూర్, నార్వే  భాగ్యనగరం ( హైదరాబాద్ )  వివిధ దేశాల నుండి ప్రతినిధులతో పాటు కార్యక్రమంలో రచయితలు గంటా మోహనరెడ్డి, దాసోజు పద్మ  తదితరులు హాజరైనారు.

0/Post a Comment/Comments