సాటిలేని మేటి అమ్మ- గద్వాల సోమన్న

సాటిలేని మేటి అమ్మ- గద్వాల సోమన్న

సాటిలేని మేటి అమ్మ
-------------------------------------
అమ్మ కదా అనురాగము
ఆమె మనసు మందారము
కాంతులీను ప్రేమ దీపము
దేవతకు  ప్రతి రూపము

అమ్మ ఉంటే కుటుంబము
పునాదిలా ఆధారము
సుఖమయమే ప్రపంచము
వెల్లివిరియు ఆనందము

అమ్మ లేని ఈ లోకము
నిండియుండు కడు శోకము
ఆమె ఉన్న చోట స్వర్గము
భువిని  మమతల దుర్గము

మాతృ మూర్తికి వందనము
త్యాగశీలికి వందనము
సదనంలో వెలుగుమయము
హృదయంలో కొలువు అనిశము

-గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు,
ఎమ్మిగనూరు,
సెల్:9966414580.

0/Post a Comment/Comments