నా తెలుగు భాష-గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు,సెల్:9966414580.

నా తెలుగు భాష-గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు,సెల్:9966414580.

నా తెలుగు భాష
------------------------------
నా తెలుగు భాష
నా గుండె శ్వాస
నా భాష సేవ
నా జీవితాశ

నా తేట తెలుగు
నా బ్రతుకు వెలుగు
తెలుగు చదివితే
మోదమే కలుగు

అందాల తోట
అపురూప కోట
నా తెలుగు భాష
బంగారు బాట

ముత్యాల మూట
మురిపించు పాట
శుభకరం తెలుగు
పలకాలి నోట

నా తెలుగు మేటి
లేదు ఏది సాటి
నా తెలుగుతల్లికి
నుతులు శత కోటి

-గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు,
ఎమ్మిగనూరు,
సెల్:9966414580.

0/Post a Comment/Comments