ప్రగతి పిల్లలం జగతి మల్లెలం
######&&&&####₹###
వస్త్రాలు నేసేటి పిల్లలం
శాస్త్రాలు చూసేటి మల్లెలం
పరిశోధన చేస్తున్నావారలం
పరివేదన మస్తున్నపోరలం. !
మేం చేనేత శిక్షణ తీసుకున్నం
మా రాత రక్షణ తెలుసుకున్నం అందుకే గురువును చేరుకున్నం
విందు జ్ఞానఫలముల కోరుకున్నం
శాస్త్రముల గురించి గురువును
అడిగి దించుకుంటాం బరువును
పరిశోధన పత్రాలు వారికి ఇస్తాం
శోధించిన సత్యాలను వివరిస్తాం!
ముందుమాట వ్రాయిస్తాం గురువుచే
ప్రతి నోటా చదివిస్తాం దరువుచే
మమ్ము అంతా మెచ్చుకొని గౌరవిస్తారు
గమ్మున వారంతా మాకు సహకరిస్తారు !
అచ్చు వేసి పుస్తకాలు రెడీగా వుంచుతాం
మచ్చుకు కొన్నింటిని సభలో
పంచుతాం
పుస్తకావిష్కరణ సభను జరిపిస్తాం
పుస్తక ప్రియులను మేం మురిపిస్తాం!
కవుల కళాకారుల ఆహ్వానిస్తాం
కవికోకిల బిరుదిచ్చి సన్మానిస్తాం
ఆవిష్కరణ దృశ్యాలను చిత్రీకరిస్తాం
పునఃస్మరణ అంశాలను సూత్రీకరిస్తాం !
ఇలా మా సాహిత్య సేవను చేస్తూ
చాలా గౌరవ మర్యాదలు మోస్తూ
సభలు సమావేశాలు నిర్వహిస్తూ
చేస్తాం మాసాహిత్య పొలాల కాస్తూ
సభా మర్యాదలను పాటిస్తూ
సభికుల మదినే దోచేస్తూ
కార్యక్రమాలను నిర్వహిస్తాం
కలుపుకొని అందరిచే పర్వం చేస్తాం
మా చేనేత వస్త్రాలను అందిస్తూ
నాయకుల మాటలకు స్పందిస్తూ
నిర్వహిస్తాం ఓ విజ్ఞాన సదస్సు
స్పందించేలా మా జనం మేదస్సు!
శాస్త్రీయ దృక్పథం దాహం తీర్చుకుంటాం
ఆ వస్త్ర కలంకారీనీ మేం నేర్చుకుంటాం
ప్రభుత్వ పారితోషకం అందుకుంటాం
ప్రగతి పథంలో మేమే ఇక ముందుంటాం !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.