Pravahini



పత్తిపాక కు అభినందనలు తెలిపిన చిటికెన
=====================


 తెలంగాణ ముద్దుబిడ్డ, మన సిరిసిల్లవాసి  డాక్టర్ పత్తిపాక మోహన్ రచించిన బాలల తాతా బాపూజీ ( గాంధీ గేయాలు, గేయ కథ )
 కు బుధవారం రోజున కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం 2022 కు ఎంపిక చేయడం పట్ల ప్రముఖ రచయిత,ఇంటర్నేషనల్ బెనెవేలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యుడు డా. చిటికెన కిరణ్ కుమార్ చరవాణి ద్వారా డా.పత్తిపాక మోహన్ కు అభినందనలు తెలియజేశారు. ఎన్నో దశాబ్దాలుగా బాల సాహిత్యంలో విశేష కృషి చేస్తూ  చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో రచనలు చేస్తూ ప్రస్తుతం ఎన్..బి.టీ సహాయ సంపాదకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న  పత్తిపాక మన సిరిసిల్ల ప్రాంతానికే కాక తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని డా.చిటికెన తెలిపారు.

0/Post a Comment/Comments