శీర్షిక.మితం ముద్దు
వనరులు పరిమతం అయ్యి
వినియోగం అధికం అయ్యి
ఉత్పత్తి తగ్గి
మూల్యం పెరిగి ధరల మంట
అధిక జనాభా తో తంటా లే
తంటాలు
ఒకరు ముద్దు రెండు హద్దు
అన్నం రేపు ఒక్కటే చాలు
అనే స్థితి కూడా రావచ్చు
జనాభా గుణ0క రూపం లో
పెరిగితే వసతులు గ్రాఫ్ రూపంలో
లంకె కుదరక ద్రవ్యోల్భణం
పెరిగి రూపాయి పతనం అంచుల్లో
పోటీ పడి అప్పులు చేస్తూ
వ్యక్తి గత అప్పులు ఎక్కువ
తలసరి ఆదాయం శూన్యం
చక్రీయా ప్రభావం ఒకదానితో
ఒక్కటి మూడి పడి
శ్రీ కరువు అయి శ్రీలంక
తిరుగుబాటు పరిస్థితులు
ఏర్పడ్డాయి
భారత్ బాగ్యాసీమ ఒకనాడు
నేడు అభివృద్ధి చెందుతున్న
దేశం గా నిన్న అదే పాట నేడు
అదే పాట రేపు కుడా అదే పాట
మరి తప్పదు వెనుకబాటు బాట
శ్రేష్టమైన మానవ వనరులు
అభివృద్ధికి సూచికె
ముప్పై కోట్ల మంది అన్నము
లేదు ఆకలి కేకలు సరిహద్దులు
దాటి విస్తరిస్తున్నాయి
తక్కువ వద్దు మరి ఎక్కువ వద్దు మితం ముద్దు
ప్రపంచాన్ని శా సిస్తున్న అమెరికా జనాభా 30 కోట్లు
భారత్ జనాభాను 150కోట్లు
ఎగుమతులు అవశ్యం
మరి అధిక జనాభా తో
అది సాధ్యమా కాదు కాదు
కొన్ని దేశాలు ఎక్కువ మందిని కంటే మదర్ హీరోయిన్, మదర్ గ్లోరిలు
అని ఇస్తున్నాయి
మన కు గుర్తుంది గా మంది
ఎక్కువైతే మజ్జిగ పలుచగా
అందుకే మితం ముద్దు
అధికం వద్దు వద్దు
ఉమశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్
జి.జె.సి దోమకొండ
కామారెడ్డి
9440408080