వెన్నెలమ్మ పదాలుగద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు.

వెన్నెలమ్మ పదాలుగద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు.

వెన్నెలమ్మ పదాలు
--------------------------------
గొప్ప వారి పలుకులు
జీవితాన వెలుగులు
దిద్దుతాయి బ్రతుకులు
ఓ వెన్నెలమ్మ

శుద్ధమైన మనసులు
శ్రేష్టమైన తలపులు
తెచ్చునోయి శుభములు
ఓ వెన్నెలమ్మ

సృష్టిలోన వనితలు
వెలుగునిచ్చు ప్రమిదలు
తావినొసగు సుమములు
ఓ వెన్నెలమ్మ

దారి చూపు గురువులు
కాపునిచ్చు గొడుగులు
ఫలములొసగు తరువులు
ఓ వెన్నెలమ్మ
-గద్వాల సోమన్న,
గణితోపాధ్యాయుడు,
ఎమ్మిగనూరు,
సెల్:9866414580

0/Post a Comment/Comments