శీర్షిక: మా ఊరు
మా ఊరంటే నాకెంతో ఇష్టం. మా ఊరిలో అందరూ కలిసిమెలిసి జీవనం సాగిస్తారు. ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉంది. చెరువు నిండితే చాలు మా పొలాలకు నీటికి కొదువుండదు. పంటలతో ఊరంతా పచ్చదనంతో ముస్తాబవుతుంది. మా ఊరిలో హైస్కూలు వరకు చదువుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చిన్న వైద్యశాల కూడా ఉంది. సమస్యలు ఎదురైనప్పుడు గ్రామపెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటారు. మంచినీటి సౌకర్యం, పిల్టర్ నీటి వసతి కూడా ఉంది. మా ఊరిలో శ్రీశ్రీ స్వయంభు కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. మా ఊరి ప్రేమాప్యాయతలు ఎంతో గొప్పవి. అంతేకాదు మా ఊరిలో స్వచ్ఛ భారత్ లో భాగంగా వీదులలో చెత్త చెదారం ఉండదు. హరితాహారంలో బాగంగా ఊరంతా మొక్కలు నాటడంతో పచ్చని చెట్లతో అందంగా అలరారుతుంది. మా ఊరుపేరు చెప్పలేదు కదా..మా ఊరు అమడబాకుల.
పల్లవి,
9వ, తరగతి,
జి.ప.ఉ.పాఠశాల,
అమడబాకుల,
వనపర్తి జిల్లా.