అహంకార ఆధిపత్యాన్ని
అహింసా వాదంతో నెగ్గిన
హిమశిఖరమతడు...
వర్ణ సంకెళ్ళ విముక్తికై
జాతికంకితమైన శ్వాసతో
మానవత్వానికి మారుగా నిలిచిన
నిలువెత్తు నిదర్శనమతడు...
చెరసాలయందు మగ్గి
జాతికై పోరాడిన ధీరుడు
కీర్తి కిరీటాల ఘనుడుగా...
జగతిన వెలుగిన వెలుగురేఖతడు
పురస్కారాల పునీతుడు
అలుపెరగని ఉత్సాహంతో
శాంతి కపోతమై...
ప్రజా గుండెచప్పుడుగా
స్వేచ్ఛా వాయువులను విరజిమ్మిన
నల్ల సూరీడతను...
చెరగని చిరునవ్వుతో
సడలని గుండెదైర్యం
కలబోసిన భారత రత్నమే
నెల్సన్ మండేలా...
శ్రీలతరమేశ్ గోస్కుల
హుజురాబాద్.