పిల్లలుంటే స్వర్గం
-------------------------------------
పిల్లలుంటే గృహము
అది ఉద్యాన వనము
దివినే తలపించును
రవినే మరిపించును
ఇల్లంతా కళకళ
చిరునవ్వుల గలగల
పసి పిల్లల ముఖములు
తారల్లా మిలమిల
జగమంతా వెలవెల
హృదయాలే విలవిల
బాలలు లేక మదులు
కొట్టుకొనును గిలగిల
చిన్నారుల సందడి
సిరిమువ్వల సవ్వడి
పిల్లలు లేకుంటే
లోకంలో అలజడి
-గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.