ముద్దుబిడ్డ బాలగంగాధర్ తిలక్ (కవిత). సహస్ర ముత్యాల హారాల అవార్డు గ్రహీత బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా .తెలంగాణ రాష్ట్రం. సెల్ .9491387977.

ముద్దుబిడ్డ బాలగంగాధర్ తిలక్ (కవిత). సహస్ర ముత్యాల హారాల అవార్డు గ్రహీత బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా .తెలంగాణ రాష్ట్రం. సెల్ .9491387977.

ముద్దుబిడ్డ బాలగంగాధర్ తిలక్
-------------&&&&&&------------------
స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించిన
భరతమాత ముద్దుబిడ్డ మన బాలగంగాధర తిలక్
మహారాష్ట్ర ప్రాంతం రత్నగిరి జిల్లా యందు
జన్మించుట మన భారతదేశం ధరణి గడ్డ గుడ్ లక్ !

గంగాధర రామచంద్ర తిలక్ గారు తండ్రి
గంగాధర సతి పుణ్యశీలపతి పార్వతి బాయి తల్లి
అనుపుణ్య దంపతుల అనంగు
 బిడ్డ తిలక్
1856 జులై 23న జన్మించి కాంగ్రెస్కు పెట్టె చెక్!

ఆయన కేసరి పత్రిక బెంగాల్.ను వెన్ను తట్టి లేపింది
స్వాతంత్ర సమరానికి ఉత్తేజపు ఉయ్యాలను ఊపింది
వందేమాతర గీతం స్వదేశీ ఉద్యమానికి ఊతం అయింది
నినాదాల హోరులో జోరులో ఉద్యమం సొంతం ఐపోయింది !

తాను గీతా రహస్యాన్ని వివరిస్తూ
కర్మయోగ శాస్త్రాన్ని ఇక రచించే
ఆర్కిటిక్ హోమ్ లో వేద రహస్యాలను
నిర్విఘ్నంగా తాను నిర్వహించే!

హిజ్ రైటింగ్ స్పీచెస్ లో వెంటనే
సంస్కరణ సందేశాలను అందించే
భరత ప్రజలందరి హృదయాలలో
చిరస్థాయిగా చిరంజీవియై జీవించే 

పాశ్చాత్య విద్యా విధానాన్ని వ్యతిరేకించిండు
భారతీయ సంస్కృతి ఔనత్యాన్ని
స్వాగతించిండు
కాంగ్రెస్ బెగ్గర్స్ ఇన్స్టిట్యూషన్ అని వర్ణించిండు
వారు బెక బెక లాడే కప్పలని తీర్మానించిండు!

తాను బాల్య వివాహాలను నిరసించాడు
వితంతు వివాహాలను ప్రోత్సహించాడు
కారాగారంలో ఉండి గీతా రహస్యం రచించాడు
ప్రపంచ దేశాలకు ఆ గ్రంథం సారం అందించాడు !

బ్రిటిష్ గవర్నమెంట్ గుండెల్లో నిదురించాడు
అదిరించి బెదిరించి వారిని ఎదిరించాడు
మహారాష్ట్ర బెంగాల్కు మధ్య వారధి ఈ తిలక్
ఆంగ్ల ప్రభుత్వ ధిక్కారస్వరానికి
పెట్టాడుగాచెక్ !

ఆ మహనీయుని తలుస్తూ నేడు
వీర తిలకం దించుకుందాం ఈనాడు
మనం అహరహం అతన్ని కొలుస్తూ
కలసి మెలసి ఉందాం నివాళులు అర్పిస్తూ!

నేడే ఈనాడే మన భరతమాత
ముద్దుబిడ్డ తిలక్ గారి జయంతి
మనమంతా మనసారా ఆయనకు
అర్పిద్దాం అక్షర తర్పణాలపూబంతి

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments