లోకజ్ఞానం పిల్లలం.(బాల గీతం) బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . నెంబర్.9491387977.

లోకజ్ఞానం పిల్లలం.(బాల గీతం) బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . నెంబర్.9491387977.

లోకజ్ఞానం పిల్లలం (బాల గీతం)
---------------&&&&&&---------------
కాలజ్ఞానం చదివిన పిల్లలం
లోకజ్ఞానంతో ఎదిగిన మల్లెలం
ఏటికి ఎదురీదిన వారలం
పోటికి ఎదురులేని పోరలం !

కాళ్లల్లో చక్రాలు ఉన్నవిలే మాకు
ఊళ్ళల్లో తిరుగుతాం రేపు మాపు
చిత్తు కాగితాలు మేం ఏరుకుంటం
గుత్తంగా మరో ఊరు చేరుకుంటం!

చేరుకున్నాం ఆమనగల్లు పట్టణం
కోరుకున్న కాగితాల కొట్టు పెట్టడం
కార్యక్రమం వెంటనే జరిగిపోయింది
ఆ పట్టణంపై గురి మాకు కుదిరింది

మేము ఆమనగల్లు ప్రజలను
నమ్ముకున్న చిన్న చిన్నపిల్లలం
మేం కనుగొన్న వీరగల్లు బొమ్మల
నమ్మకంగా అప్పజెప్పిన మల్లెలం!

మా జానెడు పొట్టకూటి కోసం
ఆ పట్టణమందు పటేల్ల గాసం 
చేస్తున్నట్టి బీద సాధ పోరలం
వస్తున్నట్టి సేదతీరిన వారలం!

రాత్రిపూట బడిలో చదువుకుంటం
గురువుగారి మాట మేము వింటం
మేం ఇష్టపడి మరీ చదువు కుంటం
మా కాయ కష్టంతో ఎదుగుతుంటం 

రోజూ మాబడి తోటకు వెళ్ళుతాం
మోజుగా ఎరువులను చల్లుతాం
ఉన్న కలుపు మొక్కలను పీకేస్తాం
తిన్నగ కలసి ఇంటికి తిరిగి వస్తాం

కష్టేఫలి అని మేమంతా నమ్ముతాం
ఇష్టపడి కౌలు భూమిని దున్నుతాం
ఫలసాయాన్ని ఫలితంగా సాధిస్తాం
రైతే రాజు అని మేం ఇక వాదిస్తాం !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.: 9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

Related Posts

Post a Comment