ఏం మనుషులు ........!
--------------------------------
ఏం మనుషులు వీరివి ఏం మనసులు.
చెడ్డ పనులు చేసేటి దొడ్డ మనుషులు
అసలు వీరు ఎంత చెప్పినా వినరు
సిసలైన దారిని వారే మాత్రం కనరు
ఏం మనుషులు వీరివి ఏం మనసులు
కోతలు కోసేటి ఈ కోతి మూక మనుషులు
కొంపకు నిప్పెట్టి తాగు చుట్టలు ముట్టిస్తరు
చెంపకు చుక్క పెట్టి ముక్కు పుడకలు కొట్టేస్తరు !
ఏం మనుషులు వీరిని ఏం మనసులు
సీట్లకై ఓట్లకై పోటీ చేయు మనుషులు
నిల్చొని పోటా పోటీగా నోట్లు పంచుతుంటరు
గెలిచిన పిదప వారు కోట్లు దండుకుంటరు!
ఏం మనుషులు వీరివి ఏం మనసులు
లాయర్లైన కొందరు లైయ్యరు మనుషులు
అన్యాయానికి కోర్టులో హాజరు వేస్తుంటరు
ఆ న్యాయానికి గైరాజరై సాక్షాన్ని మూసేస్తుంటరు!
ఏం మనుషులు వీరివి ఏం మనసులు
రౌడీయిజం చేయు కొందరు దౌర్జన్యం మనుషులు
మానవత్వాన్ని మంటగలిపి చెలరేగుతున్నరు
దానవత్వాన్ని కంట నిలిపి కాలరు ఎగరేస్తున్నరు !
ఏం మనుషులు వీరివి ఏం మనసులు
తాగుబోతు మనుషులు తందానా మనసులు
తాగిఊగి వాగుతారు మత్తులోన జోగుతారు
చిత్తయి చివరకు బొక్క బోర్ల పడతారు!
ఏం మనుషులు వీరివి ఏం మనసులు
ధన సంపాదనకై దారి తప్పు మనుషులు
జేబులు కొట్టేస్తున్నరు నోట్లను కుట్టేస్తున్నరు
నీతి తప్పి మన వెనకాల గోతులు తీరుస్తున్న రు!
ఏం మనుషులు వీరివి ఏం మనసులు
క్లబ్బుల్లో చీట్ల పేక ఆడేటి చీడ పురుగు మనుషులు
అప్పు చేసి పప్పుకూడు వండుక తింటున్నరు
తప్పుచేసి మెప్పు కూడా పొందక వారు ఉంటున్నరు !
ఏం మనుషులు వీరివి ఏం మనసులు
పబ్బుల మెరిసే మబ్బుల్లో ఆడిపాడే మనుషులు
కింద మీద పడి ఒకరి నొకరు అల్లుకుంటరు
చిందర వందరై మత్తులోన తుల్లుతుంటరు !
ఇలాంటి వారినందరిని ఒక చోట చేర్చి
వివరించాలి వారికి మంచి చెడుల గూర్చ
మనం తేవాలి వారిలోన మంచి మార్పు
జనం మెచ్చుకొని ఇస్తారులే చక్కని తీర్పు !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ :9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.