ఫోటో కవి రాంబాబును సత్కరిస్తున్న అతిథులు
వేగుచుక్క ల మెరుస్తోంది నా తెలంగాణ కవితకు ప్రశంసలు తెలిపిన మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్
తొర్రూరు : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో కలెక్టర్ శశాంక ఆధ్వర్యంలో గత రాత్రి కవి సమ్మేళనం నిర్వహించారు.తొర్రూరు పట్టణం కు చెందిన ఉత్తమ అవార్డు గ్రహీత తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి రాంబాబు తెలంగాణ స్ఫూర్తి అంశంలో వేగుచుక్క ల మెరుస్తోంది నా తెలంగాణ కవిత శీర్షికతో తన కవితా గానాన్ని వినిపించారు రాంబాబుతో పాటు కవిసమ్మేళనంలో మొత్తం 22 మంది కవులు పాల్గొని తమ గేయ వచన కవితలు వినిపించినఆహుతులను ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లాలోని స్థానిక నందన గార్డెన్స్ లో సాయంత్రం 7 గంటలకు జరిగిన కవి సమ్మేళనం లో ఉత్తమ కవి పురస్కారం రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్,మహబూబాబాద్ జిల్లా కలెక్టర్,శశాంక, మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ జడ్పీ చైర్పర్సన్ గంగోత్రి బిందు మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి తదితర అతిథుల చేతులమీదుగా ఉత్తమ ప్రశంసా పత్రం ఫీల్డ్ శాలువాలతో ఘనంగా సత్కరించారు అతిథులు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధి బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని తెలంగాణ ఏర్పాటుకు అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని ఇందులో కీలక పాత్ర కవులు కళాకారులు ఉద్యమాన్ని ఒక ఒక దశలో ప్రజల్లోకి ఉదయం నుంచి వారి సేవలు ప్రశంసనీయమని అన్నారు ముఖ్యంగా మానుకోట రాళ్లు తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పాయి అని ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కొంతమంది కవులు ఎంతో ఉద్వేగభరితంగా తమ భావాలను వ్యక్తీకరించడం మరువలేనిదని అన్నారు రాంబాబు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో లో గత నెలలో నిర్వహించిన కవి సమ్మేళనం తో పాటు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కలిగించే అంశంతో తన కవితను ప్రశ్నించినందుకు నిర్వాహకులకు ముఖ్య అతిథులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఇకముందు కూడా అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో తొర్రూరు ఆర్డీవో రమేష్ తో పాటు మండలానికి చెందిన కవి నాళం శ్రీనివాస్ కూడా పాల్గొని తమ కవితా గానాలను వినిపించి అతిథుల చే సన్మానాన్ని స్వీకరించారు