బాలల కాంక్ష
----------------------------------
చేయి చేయి కలుపుతాం
చెలిమి తోడ మెలుగుతాం
చింతలన్ని వీడుతాం
చెంగు చెంగున ఎగురుతాం
చేతులతో శ్రమిస్తాం
రాతలతో మురిపిస్తాం
కోతలన్ని కట్టిపెట్టి
చేతల్లో చూపిస్తాం
నీతికి నిలబడుతాం
జ్యోతిలా వెలుగుతాం
జాతి గౌరవం కొరకు
భీతి వీడి సాగుతాం
ఓర్పుకల్గి ఉంటాం
మార్పు కావాలంటాం
నేర్పుతో జీవితల్లో
తూర్పున ఉదయమవుతాం
--గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.