తెలంగాణ పై కవిత

తెలంగాణ పై కవిత

ఘనం
తెలంగాణ చరిత
పూడిమి ఘనం అయ్యింది
సహజ అందాలు
చారిత్రక కట్టడాలు
సంస్కృతి వైభవం
ఔన్నత్యానల కూడలి
మా యవ్వ కలలు తెరిచి అప్పుడే 8 ఏళ్ళు 
పోరాటాలు ఎన్నో ఏళ్ల
ఆరాటం నా తెలంగాణ
 దూడ హుషారుగా గెంతులు
వేస్తూ ఎద్దుల ఎన్నో బరువులు
మోస్తూ 
ఆంధ్రపాలకుల నుండి ముక్తి
పొంది స్వేచ్ఛ విహంగం అయి సాగుతుంది
భవిత ఉంది భద్రత ఉంది
కష్టించే స్వభావం ఉంది
ఆకాశమే హద్దుగా
బిన్నారంగలలో విభిన్నంగా
రాణించే అవాకాశాలు ఎన్నో
అలసత్వం వదలాలి
చైతన్యం తో అడుగులు
వేద్దాం
లాంఛవాతరం వద్దు
విద్య తో వికాసం చెంది
కులమత ల స్థానం లో
మానవత్వాన్ని ప్రోది చేద్దాం
ఉజ్వల భవిత ఉంది
ఉద్యమంలో ఉరుకులు
పరుగులు పెట్టాం
నేడు తెలంగాణ వృద్ధికి
సబ్బండ వర్గాల ఐక్యత
రాగం పలుకుదాం
    ఉమారాణి వైద్య
అంగన్వాడీ టీచర్
లింగాపూర్, కామారెడ్డి

0/Post a Comment/Comments