*ఆరోగ్య సిరి* శ్రీలతరమేశ్ గోస్కుల

*ఆరోగ్య సిరి* శ్రీలతరమేశ్ గోస్కుల

*ఆరోగ్యానికి మహాభాగ్యాన్నందించి*
*ఆయువుకు ఎనలేని రక్షణనిచ్చే సంజీవని*

*అవును..*
తనువంతా సాగదీత..
మేనియందు మెలికల సాధనతో
నూతనోత్సాహం సంతరించుకుని
నవనాడులన్నీ నవీనమై
ఒత్తిడిని జయించి ఆనందాన్ని సొంతం చేయించే అద్భుత సిరి..

అణువణువు దివ్యమై
ఆపాదమస్తకం మెరుపుల మెరుగులెన్నో దిద్దుకొని
అంతరంగ బహిరంగ శరీర సౌష్టవమందించి..
మోమునందు వెలుగులు పూయించే సమర్థవంతరి...

ఉరుకుల పరుగుల జీవితమైనా..
తనువు మనసు ఏకాగ్రతనందు కలిసిన క్షణం
రెట్టింపైన ప్రాణశక్తికి తోడు సహనశక్తినందించి..
చురుకైన జీవనాన్ని సొంతంచేసే ఆరోగ్యప్రదాయిని..

*నాడైనా నేడైనా..*
పసి వయసు మొదలు పండు ముదుసలి దాకా..
మది నిండుగా ఆచరించ దగిన మనోహరియే..
ఆసనమేదైనా ఆహ్లాదాన్నిచ్చు..
ముద్రేదైనా శరీర ముడులన్నీ తొలుగు..
సాధనలోనే ఉంది సమస్తం..
*అంతేకాదు..*
నిన్ను నీకు కూడా కొత్తగా చూపునది యోగానే..

*శ్రీలతరమేశ్ గోస్కుల*
*హుజురాబాద్.*

0/Post a Comment/Comments