శీర్షిక.అడుగుతున్నా
నర్సరీ అనే గర్భం లో
ప్రేమగా పెరిగిన నాకు
ఫోటో తో పబ్లిసిటీకి పొజిచ్చి
సవతి తల్లిగా పెంచకు నన్ను
ఆరంభ శూరత్వం తో నాయకుల తో గుంపులు గుంపులుగా ఊపిరి అడకుండా
నన్ను పెట్టి ఒంటరిని చేసి
మృత శిశువగా మార్చకు
నేను నిజమైన కమ్యూనిస్టిని
హ్యామనిస్టుని
సర్వే జనో సుఖినోభావంతు కు
నిలువెత్తు సాక్షిని
ప్రేమతో నాటు... మనసుతో సాకు
తరా లు మారిన మర్చిపోను నిన్ను
నీకు పేరు పెట్టె తొట్లేను అయ్యి
నీ పెళ్లి కి పందిరిని అయ్యి
మంగళ స్నానం లో నేనై
నీ జననం నుండి నీ చితి వరకు నేనే నేనే
ప్రకృతి సమతౌల్యతకు...పర్యావరణ సమస్య పారిష్కరకార్తను నేనే
ఆధారం నేనే...మార్గాన్ని నేనే
వర్షాలు రావాలన్న..భుకోత భూతాపం తగ్గాలన్నా నన్ను సాకు
రైతు నేస్తం...అయిర్వేదం.. ఓ మం లోని ప్రమీదను నేనే
దేశానికి సంపదై సాగుతాను నేను
అందుకు నన్ను నాటు...ప్రేమతో సాకు
ధరిత్రికి నిజమైన నేస్తాన్ని నేను
నీ రేపటి భవితకు నేనే సోపానం
స్థితి, చర,లయ కారిణి నేనే నేనే
ప్లాస్టిక్ నిషేధిద్దాం
కాలుష్యాన్ని తగ్గించుకోక
పోతే జీవ వరణం
రోగాల బారిలోకి
ప్చ్ ప్చ్ ప్చ్ ప్చ్ ప్చ్
పుట్టుక చావు మనుగడకుఆ
పూడిమి
ఆ పూడిమి కాపడుదాం
పర్యావరణ ప్రేమికులం అవుదాం
ఉమశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సివీక్స్
జి.జె.సి దోమకొండ