అందమే అందము--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

అందమే అందము--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

అందమే అందము
----------------------
వదనాన నగవులు
హృదయాన ప్రేమలు
అందమే అందము
సదనాన  బాలలు

గగనాన తారలు
దూరాన  కొండలు
అందమే అందము
తీరాన తరువులు

గుడిలోన గంటలు
మడిలోన  పంటలు
అందమే అందము
ఒడిలోని పిల్లలు

మదిలోని తలపులు
మహిలోని చెరువులు
అందమే అందము
దివిలోని సుమములు

కొలనులో  కలువలు
కనులలో  పాపలు
అందమే అందము
గృహంలో బాలలు

--గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments