నా తెలంగాణ నవ తెలంగాణ --పెద్దమ్మ ప్రియాంక

నా తెలంగాణ నవ తెలంగాణ --పెద్దమ్మ ప్రియాంక


నా తెలంగాణ నవ తెలంగాణ


మండే అగ్నిజ్వాలై రగిలే రవియై 
కమ్ముకున్న దాస్యపు శృంఖలాల కారుమబ్బులను 
చీల్చుకొని ఉదయపు కిరణమై అవతరించింది 
నా తెలంగాణ నవ తెలంగాణ 

స్వరాష్ట్ర కల్పనగా స్వపరిపాలనే ధ్యేయంగా 
పోరాటాలకు ఊపిరి పోసి ఎదురొడ్డి పోరాడి గెలిచి నిలిచినది 
నా తెలంగాణ నవ తెలంగాణ

కళలు కళాకారుల పుట్టినిల్లు సమస్త 
జీవ జాతుల పొదరిల్లు
విభిన్న మతాల సంగమం 
నా తెలంగాణ నవ తెలంగాణ

కోరిన కోర్కెలు తీర్చే కొండంత  దేవుళ్ళు 
కొలువైన పుణ్యభూమి 
నా తెలంగాణ నవ తెలంగాణ

అందాల సెలయేరుల సోయగ సౌందర్యాలు 
భూగర్భ గనులు కలకలలాడే అభయారణ్యాలు 
ప్రకృతిరమణీయతకు నెలవు కల్పతరువు 
నా తెలంగాణ నవ తెలంగాణ

సర్వపిండి రాగి సంకటి జొన్న గడ్క జొన్న రొట్టె 
గారెలు బూరెలు అంబలి ఆహా... 
పసందైన ఆహారానికి పెట్టింది పేరు 
నా తెలంగాణ నవ తెలంగాణ

విశిష్ట సంసృతి సాంప్రదాయాలకు నిలయం 
దేశానికే తలమానికం ప్రపంచానికే స్ఫూర్తి దాయకం 
నా తెలంగాణ నవ తెలంగాణ

--- పెద్దమ్మ ప్రియాంక  
మంచిర్యాల, 9908149807.
















0/Post a Comment/Comments