శీర్షిక: బడిపయనం

శీర్షిక: బడిపయనం

శీర్షిక: బడిపయనం

వేసవిసెలవులు ముగిసాయి. బడి తెరిచారు, ఎందుకో నాకు చాలా సంతోషంగా ఉంది. నేనిపుడు తొమ్మిదవ తరగతిలోకి ప్రవేశించాను. మొదటిరోజే బడికి వెళ్ళేందుకు వడివడిగా తయారయ్యాను. నా స్నేహితులను, గురువులను కలుసుకోవాలనే తపన నన్న తొందరపెడుతుంటే, చటుక్కున బయలుదేరాను. 
మా బడికి మా ఊరు ఓ కిలోమీటరు దూరంలో ఉండడంతో నడక మొదలెట్టాను. అంతలోనే చిన్న వానచినుకులు నన్ను పలకరించాయి. ఎండతో విసిగిపోయిన శరీరం వానజల్లులకు స్వాగతం పలికింది. ఎంతో హాయిగా అనిపించింది. వానపడుతుంటే వచ్చే మట్టివాసన ఎంతో స్వచ్ఛంగా ఉంది. పక్షులు, జంతువులు ఎంతో ఉల్లాసంగా ఎగురుతూ, గంతులేస్తున్నాయి. వాన చినుకులు మా పల్లెటూళ్ళకు ప్రాణాన్ని నిలబెట్టె సంజీవనిలాంటిది. వాన వస్తే పంటలు పండుతాయి. పనులుదొరుకుతాయి. చెట్టుచేమలు పచ్చదనంతో కళకళలాడుతూ, భూమినంతా సస్యశ్యామలం చేస్తుంది. అందుకే మేమంతా వానమ్మ ప్రేమికులం. వాటన్నిటిచూస్తూ నేను నా బడికి చేరుకున్నాను. అంతే మా స్నేహితులు, పిల్లలు, గురువులు మా బడిలోని చెట్లు ఇలా అందరిని చూసి ఎంతో ఆనందంగా, ఆహ్లాదకరమైన బడి ఒడిలోకి చేరాను.

యం. నూతన్ కుమార్,
9వ, తరగతి,
జి.ప.ఉ.పాఠశాల, 
అమడబాకుల.

Related Posts

Post a Comment