ఆయనొక మహా సైన్యం !-గద్వాల సోమన్న

ఆయనొక మహా సైన్యం !-గద్వాల సోమన్న

ఆయనొక  మహా సైన్యం !
-----------------------------------
ఆయనొక శక్తి !
మానవతా విలువల విలువలు
కట్టుకున్న
వ్యక్తిత్వపు వికాస మకుటాన్ని
శిరస్సున హరివిల్లులా ధరించిన
మహావ్యక్తి
ఆయనొక ప్రభంజనం!
అనిర్వచనీయమైన అనుభూతులకు నిదర్శనం!
నిస్వార్ధ మానవ సేవలో మాధవ సేవకు ఆలంబనం!
"ఈదా"వంశ గననంలో ఉదయించిన సూరీడు
మొక్కవోని ఆత్మవిశ్వాసంతో
ముందడుగు వేస్తున్న యువ కిశోరుడు
మహనీయురాలు మదర్ థెరీసా వారసుడు
ఆత్మహత్యల నివారణే ధ్యేయంగా
అభాగ్యుల జీవితాల్లో ఆశాజ్యోతిగా
సాగిపోతున్న అలుపెరుగని బాటసారి
మానవత్వం పరిమళించే ఉపకారి
సాటి మనుషులకు సహాకారి
వారే "డా.ఈదా శామ్యూల్ రెడ్డి" గారు
స్పందన ఈదా ఇంటర్నేషనల్ చైర్మన్ వారు.
-గద్వాల సోమన్న, బాలసాహిత్యవేత్త 

0/Post a Comment/Comments