చెట్టు మన ఆయువుపట్టు
----------------------------------
క్షేమమిచ్చును చెట్టు
జగతి ప్రగతికి మెట్టు
భువిని ఆయువుపట్టు
ఓ వెన్నెలమ్మ
పచ్చపచ్చని తరులు
అమూల్యమైన సిరులు
నరకకూడదు నరులు
ఓ వెన్నెలమ్మ
చెట్టు చేయును మేలు
పెంచుటే పదివేలు
పచ్చదనమే చాలు
ఓ వెన్నెలమ్మ
తల్లి వంటిది తరువు
కామధేనువు తరువు
మేలులెన్నో కలవు
ఓ వెన్నెలమ్మ
--గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.