మహా కవి " శ్రీశ్రీ " --గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

మహా కవి " శ్రీశ్రీ " --గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

మహా కవి " శ్రీశ్రీ " 
----------------------------------
సినిమా పాటల రచయిత
తెలిపెను నైతిక బాధ్యత
తెలుగు సాహిత్యంలో
చాటెను శ్రీశ్రీ దక్షత

పోసెను ప్రాణం పాటకు
ఇచ్చెను విలువను మాటకు
శ్రమైక జీవుల పక్షాన
నిలిచెను  శ్రీశ్రీ కడవరకు

మహా ప్రస్థానం వ్రాసెను
అందరి మనసులు దోచెను
శబ్దాలంకారాలతో
ఉర్రూతలు ఊగించెను

' శ్రీశ్రీ 'లతో వెలుగొందెను
కలంతో నిప్పులు చెరిగెను
తెలుగు సాహిత్యంలో
కొత్త ఒరవడి సృష్టించెను

--గద్వాల సోమన్న ,
      ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments