" ఏరువాక పున్నమి "
(బాలగేయం)
----------------------------------
ఏరువాక వచ్చింది
సంబరాలు తెచ్చింది
మోదము రైతుల్లో
ఏరులై పారింది
తొలి జల్లు కురిసింది
పొలం పని మొదలైంది
నాగళ్లతో రైతుల
పయనం కొనసాగింది
పొలం పని ముగిసింది
విశ్రాంతి దొరికింది
ఎద్దుల అలంకరణతో
బహు సందడి నెలకొంది
రైతు చల్లగుండాలి
పంట బాగా పండాలి
గిట్టుబాటు "ధర"తో
అప్పులన్నీ తీరాలి
--గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.