సాటిలేని మేటి నాన్న
(బాలగేయం )
----------------------------------
నాన్న అంటే త్యాగము
మిన్న ఇంట ఐశ్వర్యము
వెన్నెలలా చల్లదనము
వెన్న వోలె మెత్తదనము
సదనంలో నిండుదనము
వదనంలో చక్కదనము
హృదయంలో ప్రేమగుణము
అదే నాన్న గొప్పతనము
సంతతికి మూలధనము
సంపదలకాధారము
సంఘంలో గౌరవము
సంస్కార తపోవనము
నాన్న అంటే బాధ్యత
నాన్న అంటే యోగ్యత
నాన్న ఇంట వెలుగుపూలు
నాన్న గార్కి కైమోడ్పులు
--గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.