సత్యమైన ముత్యాలహారాలు. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

సత్యమైన ముత్యాలహారాలు. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

గుర్రాల.          9491387977.

సత్యమైన ముత్యాల హారాలు
--------------&&&&&&----------------
ఆకాశాన హరివిల్లు
కురిసింది వెన్నెల జల్లు
అది ఇల్లాలు లేని ఇల్లు
అతివ కవితలను అల్లు!

మాటల్లోని మంచితనం
అది అందరి మూలధనం
అని తెలుసుకొనిరి జనం
కని గమనించాలి మనం !

బాటను చూపు గురువు
అతను మన కల్పతరువు
మనకు కాదు లే బరువు
నిలబెట్టును మన పరువు!

శక్తిస్వరూపిణి గీత
దివ్య ధన్వంతరి సీత
జ్ఞాన సాగర సంగీత
జనులందరికీ మాత !

సదాచారం పాటించు
వేదపఠనం గావించు
తోటి వారిని ప్రేమించు
దేవుడు నిన్ను దీవించు !

క్రోధమును ద్వేషించు
శాంతమును స్వీకరించు
అహింసను  ఆచరించు
సత్యమును అనుసరించు !

ధర్మంగా జీవించు
అధర్మాన్ని జయించు
ఇక వంచనను తుంచు
మంచినే ప్రేమించు. !

సార హీన సంసారం
విలువ లేని దీనారం
తెలుసుకో ఇక వేగిరం
అందించును నీకు వరం !

దేహ పరిశుభ్రత కన్న
మనో పవిత్రత మిన్న
తెలిసి నడుచుకోరన్న
తెలియకున్న మిగులుసున్న!

ఏడువారాల నగలు
కోరుకున్నది కోడలు
దాంతో ఇంట్లో గొడవలు
పెరిగెను గా పగలు సెగలు!

జిహ్వ చాపల్యం వద్దు
మితా ఆహారం ముద్దు
అహంను చేసుకోరద్దు
మాధవుడిని మరవద్దు !

దురాలోచన వద్దు
దూరాలోచన ముద్దు
తెలుసుకో నీవీ పొద్దు
సదా అదే నీ పద్దు !

గీతం మన సంగీతం
సరిగమల సమ్మిళితం
శిశువు పశువు సహితం
అవుతారు ప్రభావితం!

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments