ఆణిముత్యాల మణిపూసలు
-------------&&&&&&-------------
మాటల్లో మంచితనం
అది మనకు మూలధనం
అని మీరు తెలుసుకోండి
వెంటనే ఆ వైనం !
గురువుగారిని పూజించు
చదువుల కోసం అర్ధించు
చదువు విలువను తెలుసుకో
చదువులమ్మ ను ప్రార్ధించు !
మనిషి జీవితం దివ్యం
అది ఓ మహా కావ్యం
శ్రావ్యంగా పటించుమ
నేడు జీవితం ద్రవ్యం !
తేజస్విని లక్ష్మీ సుత
సీతమ్మ అగ్నిపునీత
మరి వీరు పతివ్రతలు
వీరితోడు తులసి మాత !
ఆకాశంలో చుక్కలు
మెరిసెనులే ఇక దిక్కులు
అద్భుతమేగా దృశ్యం
తొలగిపోయే గా మబ్బులు !
అందరినీ ప్రేమించు
అంతటనూ విహరించు
దేహం దేవాలయం
గమనించి సంచరించు !
మనకు మొదటి గురువు తల్లి
తెలుసుకో నీవిక చెల్లి
కనిపించే మన దేవత
తెలిసిందా చిట్టి తల్లి !
పై నక్షత్రకాంతులు
మెరిసే మిణుగురులు
తళతళ మెరుస్తున్నవి
మిన్నుకు మణిహారాలు !
మెతుకు కరువైపోయింది
బతుకు బరువై పోయింది
వినాశ కాలం వచ్చేను
చేతికి చిప్పే మిగిలింది !
భగవంతుడు ప్రేమిస్తడు
కాని తను ద్వేషించడు
దేవుడిని నమ్ముకున్న
తను తప్పక కరుణిస్తడు !
దుఖ్ఖానికి దూరమును
సుఖానికి చేరువను
ఎపుడూ కోరుకొనరాదు
భరించు వాటి భారమును !
సరిగమల ప్రభావితం
గీతం మన సంగీతం
గమనించి అభ్యసించు
నీగళ గానామృతం !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.