ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా GCS వల్లూరి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గ్లోబల్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ అవార్డ్ 2022 కు గాను సాహిత్య రంగంలో కృషి చేసినందుకు ప్రముఖ కవయిత్రి కొదాటి అరుణ గారు ఎంపికైనట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా. వల్లూరి శ్రీనివాస్ గారు ఆహ్వానం పంపారు. తేదీ :04.06.2022 న రవీంద్ర భారతి హైద్రాబాద్ లో జరుగు కార్యక్రమంలో మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ గారు, సబితా ఇంద్రారెడ్డిగారు మరియు ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకోనున్నట్లు కవయిత్రి అరుణ తెలిపారు.ఈ సందర్భంగా వికాస వేదిక మహబూబాబాద్ అధ్యక్షులు కొంపెల్లి రామయ్య మరియు కవులు , కవయిత్రులు,రచయితలు , బంధు మిత్రులు తదితరులు అభినందించారు.