వెన్నెలమ్మ పదాలు--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

వెన్నెలమ్మ పదాలు--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

వెన్నెలమ్మ పదాలు
--------------------------------
ప్రేమలొలికే మాట 
జీవజలముల ఊట
గుబాళించే తోట
ఓ వెన్నెలమ్మ

మానవత్వము చాటు
మంచికివ్వుము చోటు
ఉండదెప్పుడు లోటు
ఓ వెన్నెలమ్మ

నిర్లక్ష్యమే చేటు
గుండె గదిపై పోటు
నీవు దానిని దాటు
ఓ వెన్నెలమ్మ

మేలు మరచిన తప్పు
అపనమ్మకం ముప్పు
కుటుంబంలో నిప్పు
ఓ వెన్నెలమ్మ
--గద్వాల సోమన్న ,
        ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments