స్వేదం తో సంపద
సృష్టించే బ్రాహ్మలు
మనుసలో మురికి లేక
మనుషుల మురికి ని
సైతం శుభ్రం చేసే
పారిశుద్ధ్య సైనికులు వారు
దేశాన్ని రక్షి0చేది సైనికులు
అయితే
దేహాన్ని రక్షించే సైనికులు వీరు
ఆరోగ్య ప్రదాలు వారు
పెట్టుబడి దారి ముసుగులో
సోషలిస్ట్ చర్యలు
అదేశిక సూత్రాల్లో
కప్పి వేయబడి
పుట్టెడు మెతుకుల
కోసం పాట్లు పడుతూ
ఆకలి కేకలు
తో అరుస్తూ
కార్మిక చట్టాలు
ఉన్నవాడి కి చుట్టాలు
అయి
మానవ నైజం కూలివాళ్లకు
డిమాండ్ వచ్చింది
అని నిట్టూర్పు తో విసుకుంటున్నాం
పెరుగుతున్న ధరల
క్షిణిస్తూ న్నా శక్తి
లంకె కుదరక
తల్లడిల్లి పోతున్న కూలి జనం
మార్క్స్ చెప్పిన విలువ కు
మూలం శ్రమ అది సత్యం
దాన్ని మర్చి ప్రపంచీకరణ
ప్రమాదం లో కార్మికుల కష్టాలు
వర్ణించ జాలవు
ఓట్ల రాజకీయం లో
యూనియన్ నాయకుల
చతురత లో ఓడి పోతూనే
ఉన్నారు
ఎర్ర సైన్యం ఎర్ర సిరా
నాలో పరిగెత్తుతుంది
ఎప్పుడు నేనె
నీకోసం నా శ్రమ
ఈ ప్రపంచ సంపద
సృష్టించేది నేను
నాకు నీడ కరువైన
నా రెక్కలు తొడిగేందుకు
బువ్వను అడ్డుకోకు
ఆకలి లేకుండా చూడు
ఊపిరి ఉన్నంత వరకు
శ్రమిస్తూనే ఉంటాను
చదువుకున్న వాళ్ళల్లో
శ్రమ కూడా దోపిడీ చేయబడుతున్న వేళ
అటు కెక్కి కూసున్న చట్టాలు
బూజు దులుపాలి
ఉమశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సివిక్స్
కామారెడ్డి
9440408080