మూల్యాంకనం..
అదో ముచ్చట
అలారం కుతాల్లో లేసి
ఆగం ఆగం గా లేసి
గడియారం వంక చూపు
చూసి హడావిడి
అప్పుడప్పుడు గడబిడ
అదో గడి బిడి
ఇల్లాలి చేత ఇంపైన వంట చేయించి
సద్ది ముద్ద సిద్ధం చేసుకోని
ఇంటినుంచి బయటకు ప్రయాణం కావాలి...
బస్సులో ప్రయాణం బహు కష్టంగా
సీటు కోసం తిప్పలు పడి
ఉంటే కూర్చుని లేకుంటే నిలబడే
గంటల సమయం నరకయాతతో గమ్యం చేరుకొని...
ఉదయం పదునైదు పేపర్లు చూడగానే
ఉషోదయపు కాంతి కళ్ళల్లో మెరిసే
ప్రయాణ కష్టము కాసేపట్లో మాయం
పేపర్ల కట్ట దిద్దడంలో మనసంతా లగ్నమాయే..
అంగీ గుండి లు తీసి
గాలి రాని పంఖా వైపు
చూసి నిట్టూర్పు
ఒక నెల జీతం పడుతుంది
అని కొందరు
పిల్లల ఖర్చు కు వస్తాయి అని
మరికొందరు
ఖేదం అయిన మోదం
అయిన రాజీపడి
పనిచేస్తూ
విద్యార్థుల భవితకు
తాము ప్రమీదలు అయ్యి
సాగుతున్న తీరు
టీ కొట్టు లో చాయి కొట్టి
ఉత్తేజం పొంది
చెమటలు తుడుచుకుంటూ కొందరు
చేతులు విసురుకుంటూ మరికొందరు
ఆపసోపాలు పడుతూ ఎందరో
కలముతో కాగితము పై యుద్ధము చేస్తూ..
స్ట్రాంగ్ రూమ్ కాల్
వస్తే తడబాటు తో
బిత్తర చూపులు
మధ్య మధ్యలో
జోకులు బాకులు
ట్రైన్ అడవిడి
రిజిస్టర్ కోసం
ఎదురుచూపులు
పరుగు ల పందెం ల
భోజన సమయం మధురానుభూతులు
నలుగురితో కలిసి వన భోజన సందడి
రకరకాల రుచులతో జిహ్వకు పసందైన విందు
జ్ఞాపకాల ముచ్చట్లతో ముగుస్తుంది సమయం..
మధ్యాహ్నపు ఎండలో మరో సమరం సిద్ధం
పేపర్లతో కట్టలపై ఎర్ర సిరా గీత మరకలు
ఎందరో విద్యార్థుల తలరాత మార్చేందుకు
పిల్లల భవిష్యత్తు అరచేతిలో పెట్టుకొని దిద్దుతూ..
ఏ.సి.ఓ ,సి.ఈ,స్క్రుటీని
ఒక త్రయం
సమయం ఆసన్నమైతే తిరిగి ప్రయాణం
ఇంటి మీద బెంగతో రాకెట్ వేగం మనసుతో
కాళ్ళు విడుస్తూ శక్తి తగ్గిన శరీరముతో
పక్షులు గూటికి చేరే కోలాహలముతో సాగుతుంది..
అబ్బ ఈ రోజు ముగిసింది
అనే మనసుకు సమాధానం
ఇది ఒక కొత్తబంగారు లోకం
ఎవరి గుసగుసలు వారివే
ఊహల్లో గుసాగుసలాడే
ఉమశేషారావు వైద్య
లింగాపూర్