ఇమ్మడి రాంబాబు
ఊరు తొర్రూరు
సురవరం సాహిత్య లోకానికి వరం
సామాజిక చైతన్య ప్రదాత సురవరం ప్రతాపరెడ్డి
రాజకీయ క్రియాశీల ఉద్యమకర్త
బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం
గోల్కొండ కవుల సంచికతో తెలంగాణ కవులకు విజ్ఞానోదయ వైతాళికుడు గా
బహుభాషా కోవిదుడు మూర్తిభవించిన
సాహితీ దిగ్గజం సురవరం ప్రతాపరెడ్డి
అసుర నిజాం నిరంకుశ పాలనలో అణగారిన తెలుగు ప్రజల అభిమాన ధన్యుడు సూరిడు సురవరం
ప్రజాసేవకై చట్టసభల్లో ప్రజల నాయక ధీశాలి సురవరం
తెలుగు నేలకు వన్నెతెచ్చిన కీర్తి ప్రదాత ప్రతాప్ రెడ్డి తెలంగాణ నేల తల్లి ఒడిలో టాంకు బండ పై
శిలా విగ్రహ స్థాపన తెలుగు వారి మదిలో సురవరం సుస్థిర స్థానం
సాహిత్య సేవల జాతీయ గుర్తింపు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెలుగు జనుల మదిలో తీపి గుర్తు సురవరం ప్రతాప రుద్రుడ అందుకో దేశ జనుల నివాళులు నా అక్షర పుష్పాంజలి
హామీ పత్రం ఈ కవి తన స్వీయ రచన ఎవరికి అనువాదం కాదు అని అనుకరణ హామీ ఇస్తున్నాను