సోమవతి అమా వాస్య ప్రాధాన్యత

సోమవతి అమా వాస్య ప్రాధాన్యత

30 ఏళ్ల తర్వాత మే 30న అద్భుత యాదృచ్ఛికం.. ఈ చిన్న పరిహారం పితృదోషాన్ని కూడా పొగొడుతుందట..
*సోమవతి అమవాస్య* 30 సంవత్సరాల తర్వాత మే 30వ తేదీన సోమవతి అమావాస్య రోజున అద్భుతమైన యాదృచ్చికం జరగబోతోంది. ఈ రోజు ఉపవాసం, పూజలు, దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎలాగో తెలుసుకుందాం..జ్యోతిష్య కాల గణన ప్రకారం అమావాస్య మే 30న వస్తుంది. అదే రోజున వివాహితలు ఆచరించే వట సావిత్రి వ్రతం కూడా రానుంది. ఇది సోమవారం రోజు రావడం వల్ల దీనిని సోమవతి అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజు సూర్యభగవానుని కుమారుడు శనిదేవుడి పుట్టినరోజు కూడా. దీనినే శని జయంతి అని కూడా అంటారు. ఉదయం నుంచి సర్వార్థ సిద్ధి యోగం, సుకర్మ యోగం కూడా ఏర్పడుతున్నాయి. 30 ఏళ్ల తర్వాత ఏర్పడే ఈ శుభ యాదృచ్ఛికంలో ఆచరించే పూజకు అద్భుత ఫలితాలు చేకూరుతాయి. అమావాస్య రోజున పూజలు చేయడం ద్వారా పితృ దోషం నుండి విముక్తి లభిస్తుంది.బ్రహ్మ ముహూర్తంలో నదిలో లేదా సరస్సులో స్నానం చేసి ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.
అమావాస్య రోజున పూజలు చేయడం ద్వారా బ్రాహ్మణుడికి ఆహారం అందించడం లేదా పేదవారికి దానం చేయడం కూడా పితృ దోషాన్ని తొలగిస్తుంది
     ఉమాశేషారావు వైద్య
      లింగాపూర్

0/Post a Comment/Comments