*స్పందనమ్మ* పుట్టినరోజు
శుభాకాంక్షలు
-----------------------------------
స్పందనమ్మ పుట్టినరోజు
ఫౌండేషన్ కు పండుగరోజు
*శామ్యూల్ రెడ్డి,నిర్మలమ్మ* ల
గర్భగుడిలోన వెలసిన రోజు
అభాగ్యులకు ఆశాదీపము
స్పందనమ్మ ప్రేమ రూపము
" SEIF "కు స్ఫూర్తిదాయకము
ఆత్మహత్యల నివారణోపాయము
" SEIF " ప్రధాన ధ్యేయము
బాలలకు మార్గదర్శనము
బ్రతుకుల్లో అరుణోదయము
నింపుటే అంతిమ లక్ష్యము
చిట్టితల్లి స్పందనమ్మకు
పుట్టినరోజు శుభాకాంక్షలు
అక్షర నక్షత్ర హారతులు
అభినందన హారములు
బాలల్లారా! రారండోయ్!
స్పందన మాట వినరండోయ్!
మేలు కలుగును బ్రతుకుల్లో
మోదమిక కన్నవారి మోముల్లో
-గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు