స్వాంతన
ఆమె హృది ప్రేమ
ఆమె సపర్యాలు రోగికి రక్ష
మానసిక ధైర్యం ఇచ్చి
విశ్వాసం ప్రోది చేసే కల్పవల్లి
అమృతవర్షి ణి
వైద్యునికి రోగికి
సంచార వారధి
తను కనురెప్ప లు
వాల్చాక నిరంతరం
కనిపెట్టే ఒక కెమెరా
క్లిష్టపరిస్థితు లను
సైతం ఓపికగా భరించి
మనోధైర్యం ఇచ్చే మాతృ మూర్తి
ప్రత్యేక దుస్తుల్లో
స్వచ్ఛత కు రూపునిచ్చి
సేవే పరమావధిగా
వృత్తి ధర్మంలో
రోగుల అసహనాన్ని
దూషణలు భరిస్తూ
ప్రేమ తో సాగె వృత్తి
ఫ్లోరెన్స్ నైట్ యాంగిల్
చే వ్యవస్థీకృత మైన
నర్సింగ్ సేవాలు
ఆ మాతృహృదయపు ఛాయలు
విస్తరించి
అంతర్జాతీయ కౌన్సిలింగ్ ఆఫ్ నర్సెస్ చే
ఆరోగ్య పరిరక్షణకు
మెరుగులు దిద్ది
మరింత సేవా ద్వారా
దైవాన్ని మరిపించే
మీ సేవాలకు హృదయపూర్వక
సలాం సలాం
మీరు ప్రత్యేక్ష దైవాలు
మీకు వందనం.సాష్టాంగ
ప్రాణమం
ఉమశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సివిక్స్
జి.జె.సి దోమకొండ
కామారెడ్డి