గుర్రాల. 9491387977.
పసిడి పలుకులు.
-------&&&-----------
( "క" ప్రారంభాక్షరంతో బాల గేయం) తే. : 27-5-2022.
1).కన్నతల్లిని ప్రేమించు
కన్న తండ్రిని పూజించు
కడుపులో పెట్టుకొని వారు
కరుణతో చూస్తుంటారు !
2) కవిత్వం మెప్పుగ రాసిన వాడు
కవిగా తానుతప్పక మారుతాడు
కర్ణ కఠోరంగా ఆ కవిత్వం ఉంటే
కవిగారికి అందరితో ఇక తంటే. !
3) కథ ఇక కంచి కి వెళ్లింది
కథనంపై మనసు మళ్ళింది
కవనం తన దారి మార్చుకుంది
కవిత్వమై మరి అది కూర్చుంది.!
4). కరిగిన కాలం తిరిగి రాదు
కసరుకొను వీలు అసలు లేదు
కనుమరుగై అది పోతుంటుంది
కటిక చీకటే మిగిలిపోతుంటుంది
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977
నాగర్ కర్నూలు జిల్లా.