చదువుదాం-ఎదుగుదాం
----------&&&&&-------------
చదువుదాం చదువుదాం
చదివి మనం ఎదుగుదాం
చదువుల తల్లికిమొక్కుదాం
పదవుల మల్లికి చిక్కుదాం !
చదువులపై పెట్టండి శ్రద్ధ
పదవులపై కొట్టండి ముద్ర
జీవితం కాదులే అద్రకభద్ర
వదులుకో ఇక మత్తు నిద్ర!
కావాలి చదువే ఇక నీధ్యేయం
రావాలి మతికి ఆ అధ్యాయం
చేయాలి నిత్యం అధ్యయనం
కావాలిగా సత్యం అభ్యసనం !
చదువులమ్మ గుడిమెట్లను ఎక్కు
ఆ తల్లి పాదాలకు నువ్వు మొక్కు
తొలగిపోవు నీ చదువులోని చిక్కు
వెలిగిపోయి నిలిచిపోవు నీ లక్కు !
చదువుల సారాన్ని గ్రహించు
పదవుల భారాన్ని నిగ్రహించు
చదువుల మూలాలను గుర్తించు
పదవుల మేళాలకు అది వర్తించు!
ఇల్లాలికి ఉండాలిక చదువు
పిల్లలకు అది ఔనులే నెలవు
చదువులమ్మను నీవిక పిలువు
అందునులే అవకాశాల కొలువు!
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.