- ప్రశ్నపత్రం పూర్తిగా చదవాలి.
- సమాధానం రాయగల ప్రశ్నలని ఎంపిక చేసుకోవాలి.
- అన్నింటికి సమాధానాలు వరుసక్రమంలో రాయడం మంచిది.
- ఛాయిస్ లు పోగా అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసే ప్రయత్నం చేయాలి.
- ప్రశ్నను బట్టి మార్కులకు అనుగుణంగా సమాధానాలు రాయాలి.
- సమయ పాలన (సమయం సర్దుబాటు) చాలా ముఖ్యం.
- పరీక్ష హాలులో ప్రతీ క్షణం ఎంతో విలువైనది. సమయం వృధాచేయకూడదు.
- తెలుసు కదా అని జవాబు ఎక్కువగా రాయకూడదు.
- సమాధాన పత్రంలో కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి.
- హ్యాండ్ రైటింగ్ చక్కగా ఉండాలి.
- బాల్ పాయింట్ పెన్నులు మాత్రమే వాడాలి.
కవి పరిచయం - పద్య లేదా గద్యభాగ పాఠ్యాంశాల కవిపరిచయాలు చదవాలి.
సృజనాత్మకత - లేఖ, వ్యాసం, సంభాషణా రచన, ఇంటర్వ్యూ ప్రశ్నావళి, నినాదాలు, కరపత్రం, మొదలైన సృజనాత్మక అంశాలు రాయడం తెలియాలి.
సారాంశాలు - అన్నింటికంటే ముఖ్యం 9 పాఠాల సారాంశాలు తెలిసివుండాలి. వాటిని రాయ ఆధారం చేసుకుని ఇచ్చిన ప్రశ్నలకు సొంతమాటల్లో సమాధానాలు ఇవ్వాలి.
ఉపవాచకం - రామాయణములో గల ఆరు కాండములలో ఏ కాండంలో కథ ఎంతవరకు ఉందో గుర్తుంచుకోవాలి. ముఖ్య పాత్రలు, సంఘటనలు గుర్తుంచుకోవాలి.
పదజాలం - తొలగించినవి కాకుండా మిగిలిన 9 పాఠాలలో గల అన్ని పదజాల అంశాలను చదవాలి. వీటితో పాటు పాఠ్యపుస్తకం చివరన గల పదవిజ్ఞానం కూడా చదవాలి.
వ్యాకరణాంశాలు - సంధులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలు. కర్తరీ, కర్మణీ వాక్యాలు. ప్రత్యక్ష, పరోక్ష కథనాలు. ప్రాచీన వచనం నుండి ఆధునిక వచనం లోకి మార్చడం మొదలైన వాటిని అభ్యసించాలి.
(గమనిక: మీరు 100 శాతం తెలుగు పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. ఇక మీరు ఏమీ భయపడకుండా పరీక్ష రాసి 10/10సాధించడమే. ఇన్ని రోజులు చదివింది. ప్రశాంతంగా పరీక్ష రాయండి. ప్రశ్నపత్రం చదవండి. జవాబులు గుర్తుచేసుకోండి. అద్భుతంగా రాయండి)
- Rajendra 6302324734(WhatsApp Only)
Open the Link👇