పది పేజీల్లో-పది తెలుగు@TS-SSC-May2022

పది పేజీల్లో-పది తెలుగు@TS-SSC-May2022

కంఠస్థ పద్యాలు
కులమున్ రాజ్యముఁ దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుం
డలఁతిం బోఁడు త్రివిక్రమస్ఫురణవాఁడై నిండు బ్రహ్మాండముం
గలడే మాన్ప నొకండు? నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్
వలదీ దానము గీనముం; బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా!
భావం: దాతలలో గొప్పవాడా! ఓ బలి చక్రవర్తీ! నీ కులాన్నీ, రాజ్యాన్నీ, పరాక్రమాన్నీ, నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు. కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు. మూడడుగులతో మూడులోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా? నా మాట విను. దానం వద్దు గీనం  వద్దు.  ఈ  బ్రహ్మచారిని (వామనుడిని)  పంపించు.

కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా !
భావం:  ఆచార్యా ! పూర్వం రాజులు ఉన్నారు. రాజ్యాలు ఉన్నాయి. వారు ఏంతో అహంకారంతో విర్రవీగారు . కానీ వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదూ. ప్రపంచంలో వారి పేర్లుకూడా మిగులలేదు. శిబిచక్రవర్తి వంటివారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోర్కెలు తీర్చలేదా? వారిని ఈనాటికీ లోకం మరువలేదు  కదా.

నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు
ర్మరణం బైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ముపో;
హరుఁడైనన్, హరియైన, నీరజభవుం డభ్యాగతుండైన నౌఁ;
దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా! ధీవర్య! వేయేటికిన్?
భావం: ఓ పండితోత్తమా! నాకు నరకం దాపురించినా సరే. బంధనం ప్రాప్తమైనా మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైనా, నాకు దుర్మరణం  వచ్చినా సరే, నా వంశం అంతా నశించినా సరే. ఏమైనా కానీ, ఏదైనా రానీ! ఎందుకు ఇన్ని మాటలు. వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే. నా నాలుక వెనుదిరుగదు. (ఆడిన మాట తప్పను).

నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుంగు కుర్రలన్!
ప్రాయము వచ్చినంతనె కృపాణములిచ్చితి, యుద్ధమాడి వా
జ్రేయ భుజాబలమ్ము దరిసింప జగమ్ము, నవాబుతో సవాల్
చేయుమటంటి; వీ తెలుగు రేగడిలో జిగి మెండు మాతరో!
భావం: అమ్మా! కోటి మంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు వారికి వయసు రాగానే చేతులకు కత్తులనిచ్చి వజ్ర సమానమైన భుజ పరాక్రమాలను లోకం చూసేటట్లు నిజాం రాజు తో తలపడ మన్నావు ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో కదా!
 
తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము! రా
జలలాముం డనువాని పీచమడచన్ సాగించె యుద్ధమ్ము! భీ
తిలిపోయెన్ జగమెల్ల యేమియగునో తెల్యంగరాకన్! దిశాం
చలముల్ శక్రధనుఃపరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్
భావం: ఈ తెలంగాణలో గడ్డి పోచ కూడా కత్తి బట్టి ఎదిరించింది. తాను గొప్పరాజునని అనుకునే వాని గర్వాన్ని అణచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడి పోయింది. దిగంతాల నీ ఆకాశంలో ఇంద్రధనస్సుల వరుసలతో సయ్యాట లాడాయి.

తెలంగాణా! భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సం
చలనమ్మూరక పోవలేదు! వసుధా చక్రమ్ము సారించి ఉ
జ్జ్వల వైభాతిక భానునిన్ పిలిచి దేశంబంతటన్ కాంతి వా
ర్థులు నిండించిరి, వీరు వీరులు పరార్థుల్ తెల్గుజోదుల్ బళా!
భావం: అమ్మా తెలంగాణా! నీ పిల్లలలో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. వీరు భూమండలమంతా సవరించి ఉజ్జ్వలమైన కాంతివంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వీరంతా వీరులు యోధులే కాదు పరోపకారులు కూడా.
కవి/రచయిత ప్రక్రియ  పరిచయం
1. దానశీలము - బమ్మెర పోతన : దానశీలము పోతన రచించిన శ్రీమహాభాగవతం అష్టమ స్కంధంలోని 'వామన చరిత్ర' లోనిది.  ప్రక్రియ: పురాణం. పురాణం అంటే పాతదైననూ కొత్తగా భాసించేది. పురాణాలు 18. వీటిని సంస్కృతంలో వ్యాసుడు రాశాడు. 
3. వీర తెలంగాణ - డా. దాశరథి కృష్ణమాచార్య : దాశరథి రచించిన “దాశరథి సాహిత్యం ” ఒకటవ సంపుటి 'రుద్రవీణ' లోనిది.ప్రక్రియ: పద్యం. చారిత్రక అంశాలను వస్తువుగా తీసుకొని రాసిన పద్యాలివి.
7. శతక మధురిమ - వివిధ కవులు : ఈ పాఠ్యభాగంలో వివిధ కవులు రచించిన 8శతకాల నుండి పద్యాలు ఉన్నాయి. 
ప్రక్రియ: శతకం. శతకాలలోని పద్యాలను 'ముక్తకాలు' అంటారు. ముక్తక పద్యం దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. శతకాల్లో మకుటం సాధారణంగా పద్యపాదం చివర ఉంటుంది. అయితే మకుట రహితంగా కూడా కొన్ని శతకాలు ఉన్నాయి.
సర్వేశ్వర శతకం - యథావాక్కుల అన్నమయ్య
శ్రీకాళహస్తీశ్వర శతకం - ధూర్జటి
మల్లభూపాలీయ - ఎలకూచి బాలసరస్వాతి
దాశరథి శతకం - కంచర్ల గోపన్న (రామదాసు)
నరసింహ శతకం - కాకుత్సం శేషప్ప కవి
విశ్వనాథేశ్వర శతకం - గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ
లొంక రామేశ్వర శతకం - నంబి శ్రీధరరావు
వేణుగోపాల శతకం - గడిగె భీమకవి
9. జీవన భాష్యం - డాక్టర్ సి. నారాయణరెడ్డి : “డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి సమగ్ర సాహిత్యం” ఆరవ సంపుటిలోని “తెలుగు గజళ్ళ” లోనిది. ప్రక్రియ: గజల్. గజల్ లో పల్లవిని “మత్లా” అని, చివరి చరణాన్ని "మక్తా” అని, కవి నామముద్రను "తఖల్లుస్” అని అంటారు. పల్లవి చివర ఉన్న పదం, ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది. సరస భావన, చమత్కార ఖేలన, ఇంపూ, కుదింపూ గజల్ జీవగుణాలు.

పాఠ్యభాగ సారాంశాలు
దానశీలము
బలిచక్రవర్తి తన ప్రాణం పోతుందని తెలిసినా తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన గురువైన శుక్రాచార్యుడు ఎంత వారించినా, హెచ్చరించినా గురువు మాటలు వినకుండా వామనునికి దానం చేస్తాడు. బలిచక్రవర్తి  తన  శక్తిసామర్థ్యాలతో  స్వర్గలోకాన్ని ఆక్రమిస్తాడు.  ఈ విషయాన్ని దేవతలు విష్ణువుతో చెప్పగా  కొంత  కాలానికి విష్ణువు  వామన అవతారం  ఎత్తి నర్మదా నదీ తీరంలో యాగం చేస్తున్న బలిచక్రవర్తి వద్దకు వెళ్లి మూడడుగుల నేల కావాలని అడగగా ఇస్తానని మాటయిస్తాడు. వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహించిన అసుర గురువు శుక్రాచార్యుడు  బలిని  దానం  ఇవ్వవద్దంటాడు.
శుక్రాచార్యుడు - దాతలలో గొప్పవాడవైన ఓ బలిచక్రవర్తీ! వచ్చినటువంటి వామనుడు ఆ పొట్టివాడు సామాన్యుడుకాడు. మూడు అడుగులతో ముల్లోకాల్ని కొలవగలడు. అతడిని ఎవరూ ఆపలేరు. నా మాట విను. దానం వద్దు గీనం వద్దు. ఆ బ్రహ్మచారియైన వామనుని పంపించు.  అని  బలిచక్రవర్తి  తో  అంటాడు. అప్పుడు బలిచక్రవర్తి.... ఓ మహాత్మా! ఇచ్చినమాటతప్పడంకన్నా పాపం లేదు. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి పంపించలేను. మాటకు కట్టువడి సత్యంతో బ్రతకడమే మానధనులకు మేలైన మార్గం. పూర్వం రాజులులేరా? రాజ్యాలు లేవా? వారేమైనా మూటగట్టుకొని పోయారా? అడిగిన వారికి లేదనకుండా దానం చేసిన శిబిలాంటి కొందరిని మాత్రమే  ఈలోకం  గుర్తుంచుకుంది. 
ఓ పండితోత్తమా! నాకు నరకం దాపురించినా, బంధనం ప్రాప్తమైనా, ఈ భూమండలం అదృశ్యమైనా, నాకు దుర్మరణం వచ్చినా, నా వంశం నశించినా ఏది ఏమైనా కానీ! ఇన్ని మాటలు ఎందుకు వచ్చినవాడు విష్ణువు, శివుడు,బ్రహ్మ ఎవరైనా సరే ఆడినమాట తప్పను. ఎన్ని కష్టాలకు గురైనా, పేదరికం వచ్చినా, మరణమే సంభవించినా అభిమానధనులు మాట తప్పలేరు. అని బలిచక్రవర్తిఅంటుండగా భర్త సైగను గ్రహించిన అతని భార్య వింధ్యావళి ఆ వామనుడి కాళ్ళు కడగడానికి బంగారు కలశంలో నీళ్ళు తీసుకుని వన్తుంది. అప్పుడు బలిచక్రవర్తి వామనున్ని పిలిచి లేవయ్యా! ఇటురా! నీవు అడిగింది లేదనకుండా ఇస్తాఅంటూ అతడి పాదాల్ని కడిగి పూజించి నీకు మూడు అడుగుల నేలను దానం  చేస్తున్నానంటూ చేతిలో నీటిని ధారవోసాడు. అదిచూసి లోకం ఆశ్చర్యపడింది. పది దిక్కులూ, పంచభూతాలు “బళి బళి” అని పొగడాయి.
వీర తెలంగాణ
తెలంగాణ ప్రజలు పూరించిన ఉద్యమ శంఖారావం భూమండలం అంతా  ప్రతిధ్వనించాయి. అన్ని దిక్కులు మేల్కొల్పేటట్లు చేసాయి. దుర్మార్గుల చేతిలో చిక్కుకున్న తెలంగాణ గొప్పతనం విశేషాలకు ఇప్పుడు అడ్డులు తొలగిపోయాయి. తెలంగాణ తల్లి తన ఒడిలో కోటి మంది తెలుగు పిల్లల్ని పెంచి వారికి యుక్తవయస్సు రాగానే చేతులకు కత్తులనిచ్చి నిజాం రాజు తో తలపడమని చెప్పింది. 
తెలంగాణలో గడ్డి పోచ కూడా కత్తిబట్టి ఎదిరించింది. తానే గొప్ప రాజును అనుకునే నిజాం గర్వాన్ని అణచివేసేట్లుగా యుద్ధం సాగించింది. తెలంగాణలో ఏమి జరుగుతుందో తెలియక ప్రపంచమంతా భయపడిపోయింది. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తులు కావడం కోసం తెలంగాణ ప్రజలు చేసిన స్వాతంత్ర్య పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగింది. తెలంగాణ పిల్లల్లో వచ్చిన విప్లవాత్మకమైన కదలిక భూమండలం అంతా ఆవరించింది. తెలంగాణ బిడ్డలంతా వీరులు, యోధులు, పరోపకారులు. 
మతం అనే పిశాచి తన క్రూరమైన కోరలతో తెలంగాణను ఆక్రమించి, ప్రజల గొంతులు కోస్తున్నప్పుడు తెలుగుదనాన్ని కోల్పోకుండా యుద్ధ రంగంలో దిగి విజయాన్ని సాధించారు. కాకతీయుల నుండి నేటిదాకా శత్రువుల దొంగదెబ్బలకు తెలంగాణ ఓడిపోలేదు. విజయం సాధిస్తూ ముందుకు సాగుతూనే ఉన్నది.
శతక మధురిమ

  1. సర్వేశ్వరా! నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం. రెండవ పుష్పం దయ. మూడో పుష్పం మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత. ఇది భక్తియోగ విధానం. ఈ మూడు పుష్పాలు లేని పూజలను నీవు అంగీకరించవుకదా!
  2. శ్రీకాళహస్తీశ్వరా! తినడానికి అడిగితే ఎవరైనా ఇంత భిక్షం పెడతారు. నివసించడానికి గుహలున్నాయి. వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి. తాగడానికి నదుల్లో చల్లని అమృతం వంటి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది. తాపసులను కాపాడడానికి నీవున్నావు. అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తారో తెలియదు.
  3. నీతిలో బృహస్పతి అంతటి వాడవైన ఓ సురభిమల్లా! తలవంచి గురువు పాదాలకు నమస్కరించేవాడు, దానగుణం కలిగిన వాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు, భుజబలంతో విజయాలను పొందేవాడు, మనసు నిండా మంచితనం కలవాడైన పండితుడు సంపదలు లేకున్నా  ప్రకాశిస్తాడు.
  4. దశరథుని కుమారా! దయాసముద్రునివైన శ్రీరామా! నీవు యుద్ధరంగంలో శత్రుభయంకరుడవు, దుఃఖాలు పొందే వారి పాలిట బంధువువు, కాంతివంతమైన బాణాలు, అమ్ములపొది, కోదండము కలిగి, ప్రచండ భుజ తాండవ ధనుర్విద్యాకళలో కీర్తి పొందిన నీకు సాటివచ్చే దైవం మరొకరులేరని మదించిన ఏనుగునెక్కి ఢంకా మోగిస్తూ భూమండలమంతా వినబడేటట్లు చాటుతాను!
  5. అలంకారాలచేత శోభిల్లేవాడా! ధర్మపురిక్షేత్రంలో వెలసిన వాడా! దుష్టులను సంహరించేవాడా! పాపాలను దూరంచేసేవాడా! నరసింహా! విష్ణుభక్తులను నిందించకుండా ఉంటేచాలు, అనేక గ్రంథాలను చదివినట్లే, బిక్షమిచ్చేవారిని ఆపకుంటేచాలు అది దానము చేసినట్లే. సజ్జనులను మోసం చేయకుండా ఉంటేచాలు. గొప్ప బహుమతిని ఇచ్చినట్లే, దేవతా మాన్యములను ఆక్రమించకుండా ఉంటేచాలు, బంగారు ధ్వజస్తంభంతో కూడిన గుడికట్టించినట్లే, ఇంకొకరి 'వర్షాశనాన్ని' (ఒక ఏడాదికి సరిపడా భోజనాన్ని) ముంచకుంటేచాలు, తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది.
  6. విశ్వనాథేశ్వరా! త్యాగం తో కూడిన దీక్షను పోనీ జనులందరి దీనస్థితిని రూపుమాపి అందరికీ సుకుమారమైన ఆనందకరమైన జీవితసుఖాన్ని పంచి, మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరైతే విశదపరుస్తారో వారే గొప్ప వారవుతారు. అపూర్వమైన కీర్తిమంతులవుతారు.
  7. ఓ లొంక రామేశ్వరా! మిత్రుడైన వాడు పుస్తకంమాదిరిగా మిక్కిలినేర్పుతో మంచిని బోధిస్తాడు. కార్య సఫలతలో విలువైన ధనంవలె ఉపకరిస్తాడు. శత్రునాశనంనాశనంలో స్వాధీనమైన కత్తివలె సహాయపడుతాడు. నిండు  మనస్సై సుఖాన్నిస్తాడు.
  8. దయకు నిధివంటివాడా! నాగరకుంట పురమునందు కొలువైనవాడా! వేణుగోపాలకృష్ణా! నా దైవమా! శౌరీ! కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు, మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించేవాడు, కులగర్వంతోటి పేదవాండ్ల ఇండ్లను నాశనం చేసేవాడు, లంచాలకు విలువను పెంచేవాడు, చెడు ప్రవర్తనతో తిరిగేవాడు, వావివరుసలను పాటించనివాడు, నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటివాడిని నాశనం చేయాలనుకునేవాడు, తల్లిదండ్రులను ఇంటినుంచి వెళ్ళగొట్టేవాడు ఈ భూమి మీద మానవ రూపంలో ఉన్న రాక్షసుడుగాని వేరొకడుగాడు కదా!
జీవన భాష్యం
నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులుమబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది. ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినపుడు అడుగడుగునా ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కాని ఆ మాటలకు భయపడకుండా నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తే నలుగురు అనుసరించే దారిగా మారుతుంది. బీడుపడి, పనికిరాకుండా ఉన్న నేలలో ఏ పంటలూ పండవని ఏ ప్రయత్నాలూ చేయకుండానే నిరాశపడవద్దు. కష్టపడి ఆ నేలను దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి. నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించడమే ఉత్తమ సాంఘిక జీవనం. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే అందరు కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుంది.

ఎంత సామర్థ్యమున్నా, అధికారం, సంపదలు ఉన్నా ఎన్నో విజయాలు సాధించినా ఇక నాకు ఏ కష్టాలూ బాధలూ రావని ధీమాగా ఉండలేం. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూఊహించలేరు. దాని శక్తిముందు ఎవరైనా తలవంచవలసిందే. ఉన్నతమైన హిమాలయ పర్వతశిఖరం కూడా ఎండవేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే! అలాగే ఎంతటి మనిషి గర్వమైనా నీరుకారిపోవలసిందే. మనపేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని, ప్రతిష్టాత్మక బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైనవిలువ, గుర్తింపు లేదు. మానవాళికి పనికివచ్చే గొప్పపని, చెరగని త్యాగం చేస్తేనే ఆ మనిషిపేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది
వాల్మీకి రామాయణం మూల భాష సంస్కృతం. రామాయణం ప్రపంచ సాహిత్యంలో మొదటి కావ్యం. వాల్మీకి ఆది కవి రామాయణానికి పౌలస్త్య వధ, సీతాయాశ్చరితం మహత్ అనే పేర్లున్నాయి. రామాయణంలో ఆరు కాండంలు కలవు. అవి బాల కాండం, అయోధ్యకాండం, అరణ్యకాండం, కిష్కిందకాండం, సుందరకాండం, యుద్ధకాండం. వాల్మీకి రామాయణంలో 24 వేల శ్లోకాలు కలవు. తెలుగులో మొదటి రామాయణం రంగనాథ రామాయణం. రచయిత గోనబుద్ధారెడ్డి. ఇది ద్విపద రచన. తెలుగులో ఇంకా భాస్కర,  మొల్ల, ఉషశ్రీ రామాయణాలు సుప్రసిద్ధం.
బాలకాండం: బ్రహ్మ ఆదేశానుసారం రామాయణం రచనకు శ్రీకారం చుట్టాడు. వాల్మీకి అయోధ్య నగరం వర్ణనతో శ్రీ రాముని జననం నుండి మొదలుకొని స్వయం వరం తర్వాత పరశురాముని గర్వభంగం - అయోధ్యకు చేరుకోవడం - భరత శత్రుఘ్నులు మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళడం.
అయోధ్యకాండం: దశరథుడు మిత్రుల మీద ప్రేమతో శ్రీ రాముని పట్టాభిషేకం చేయాలని నిర్ణయం - కైకేయి దశరథున్ని వరాలు కోరుకోవడం - రాముడు వనవాసం వెళ్లడం - భరతునికి పాదుకలు ఇవ్వడం - రాముడు సీత లక్ష్మణుడు అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి దండకారణ్యం లోకి ప్రవేశించడం.
అరణ్యకాండం: దండకారణ్య ప్రవేశం తర్వాత అందులో లో పర్ణశాల ఏర్పాటు - విరాధుని శాపవిమోచనం - సీతాపహరణం సుగ్రీవుని మైత్రి కొరకు ఋష్యమూక పర్వతాన్ని కి ప్రయాణం - దారిలో పంపా సరోవరాన్ని దర్శించడం.
కిష్కిందకాండం: రామలక్ష్మణులను చూసిన సుగ్రీవుడు భయంతో హనుమంతుని పంపడం - వీరికి మైత్రి కుదరడం - వాలిని వధించడం - సీత జాడ వెతుకుతూ వానర సైన్యం నలుదిక్కుల పయనం - హనుమంతున్ని జాంబవంతుడు ప్రేరేపించడం -  సముద్రలంఘనం కొరకు మహేంద్రగిరి చేరుకోవడం.
సుందరకాండం: హనుమ సముద్ర లంఘనం - లంకలో ఒక వనంలో సీతను చూడడం - సీతతో హనుమ మాట్లాడటం - హనుమంతుని తోకకు నిప్పు పెట్టడం - తిరిగి మహేంద్రగిరి పర్వతాన్ని చేరుకోవడం - శ్రీరాముని దగ్గరకు చేరుకొని సీత వృత్తాంతాన్ని చెప్పడం.
యుద్ధకాండం: శ్రీరాముడు హనుమంతుడి సాహసాన్ని ప్రశంసించడం - వానర సైన్యం తో లంక కు ప్రయాణం - లంకలో రామ రావణ యుద్ధం - సీత వానర సైన్యం సమేతంగా అయోధ్యకు చేరుకోవడం - అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం.
సృజనాత్మకత
లేఖ: లిఖించడం అంటే రాయండం. లిఖించడం ద్వారా విషయాన్ని, అనుభూతుల్ని పంచుకోవడమే లేఖ. లేఖలో ఉండే ముఖ్యభాగాలు రెండు. అవి. 1. విషయం, 2. లేఖ భాగాలు, రెండూ సందర్భోచితంగా ఉండాలి. లేఖలోని మొత్తం భాగాలు రాసినా, విషయం లేకుంటే ప్రయోజనం లేదని గుర్తుంచుకోండి.
వ్యాసం: విషయాన్ని విస్తరించి లేదా వివరించి చెప్పడమే వ్యాసం. ఎంచుకున్న ఏ విషయాన్నైనా చదువరులకు అర్ధమయ్యేలా వివిధ ఉదాహరణలతో, జాతీయాలు పదబంధాలతో రాసే వ్యాసాలు ఆసక్తిదాయకంగా ఉంటాయి. విషయాన్ని ఏదో ఒక అంశంతో ప్రారంభించాలి. ఇది రాబోయే వ్యాసంలోని విషయాన్ని పరిచయం చేయాలి. దీనినే 'ఉపోద్ఘాతం' అంటారు. ఉపోద్ఘాతంలో చెప్పిన విషయాలను వ్యాసంలో విస్తరించాలి. దీనినే విషయ విస్తరణ అంటారు. రాసే విషయాలన్నీ రాసి, దానిపై మన సొంత అభిప్రాయాన్ని జోడించాలి. అదే ముగింపు లేదా ఉపసంహారం. 
వ్యాస నిర్మాణ క్రమం: ఉపోద్ఘాతం, విషయ వివరణ, ముగింపులు 
సంభాషణా రచన: సంభాషణ అంటే ఎదుటి వ్యక్తితో నోటి ద్వారా చేసే భావ వినిమయం. ఒకే వ్యక్తి మాట్లాడుతూ పోతే దీనిని ఉపన్యాసం అంటారు. ఇద్దరు వ్యక్తులు విషయాన్ని పంచుకుంటే సంభాషణ అంటారు. సన్నివేశాన్ని బట్టి సంభాషణ తీరుతెన్నులుంటాయి. అతిథులతో సంభాషించేటప్పుడు మర్యాదగా, పెద్దవారితో సంభాషించే టప్పుడు గౌరవంగా, ఆత్మీయులతో సంభాషించేటప్పుడు చనువుగా అధికారులతో మాట్లాడేటప్పుడు విషయ ప్రాధాన్యం ఉండేలా మాట్లాడాలి. విషయపరమైన సంభాషణ రాయమని అడిగితే, సంభాషణలో ఎక్కువ భాగం ఆ విషయాన్ని గురించే ఉండాలి. 
కనీసం రెండు పాత్రలలో సంభాషణ నిర్వహించాలి. అవసరమైతే పాత్రల సంఖ్య పెరగవచ్చు.ఒక్కో పాత్రకు కనీసం 5 సంభాషణ వాక్యాలతో, అంటే మొత్తం 10 వాక్యాలకు తగ్గకుండా సంభాషణ రాయాలి. నిడివి కొంచెం పెరిగినా ఫరవాలేదు.
ఇంటర్వ్యూ  ప్రశ్నావళి: నోటి మాటల ద్వారా ప్రశ్నలను అడుగుతూ సమాధానాల్ని రాబడితే అది ఇంటర్వ్యూ అలా కాకుండా లిఖిత పూర్వకంగా ప్రశ్నల్ని రాసి అడిగితే అది ప్రశ్నావళి. ఐతే పరీక్షల్లో, ఇంటర్వ్యూ ఐనా, ప్రశ్నావళి ఐనా రాయాల్సిందే! ఇంటర్వ్యూ  ప్రశ్నావళిని సిద్ధం చేసుకొనేటప్పుడు మనం ఏ విషయాన్ని రాబడుతున్నామో, ప్రధానంగా ఆ విషయానికి సంబంధించిన ప్రశ్నలే అడగాలి. ప్రముఖులను ఇంటర్వ్యూ చేయమన్నప్పుడు కొన్ని ప్రశ్నలు వారి వ్యక్తిగత అంశాలపైన కూడా అడగవచ్చు. 10-15 ప్రశ్నలు రాస్తే సరిపోతుంది.
నినాదాలు, సూక్తులు: నినాదం: ఇది సూటిగా, గుర్తుండిపోయేలా ఉండాలి. పది వాక్యాలు చెప్పలేని అంశాన్ని ఒక నినాదం బలంగా చెప్పగలుగుతుంది. ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి, హృదయానికి హత్తుకునేలా చిరకాలం గుర్తుండేలా రూపొందేవి నినాదాలు. సమాజంలో వివిధ సందర్భాలలో నినాదాలను ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటిని పరిశీలించండి. అలాగే, ప్రాస కలిసేటట్టుగా, భావం బలంగా వ్యక్తమయ్యేలా వివిధ అంశాలకు సంబంధించిన సూక్తులను సేకరించండి. సొంతంగా కొన్నింటిని రాసే ప్రయత్నం చేయండి. ...
గేయం/కవిత: గేయం, కవిత రెండూ ఒకటే. లయబద్ధంగా ఉంటే గేయం అంటాం. ఇది పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. కవితకు లయ అవసరం లేదు. కవితలను నిర్వచించడం కష్టం. ఐనా, చెప్పవలసిన విషయాన్ని హృదయానికి హత్తుకునేలా, చక్కగా, అందంగా, సరైన చోట సరైన పదాల్ని ప్రయోగిస్తూ చెప్పడాన్ని కవిత్వంగా చెప్పవచ్చు. కవితను రాయమన్నప్పుడు, వీలున్నన్ని వర్ణనలను, పోలికలను అంటే ఉపమాలంకారం, రూపకాలంకారం లాంటి అలంకారాలను, ప్రాసలను వాడే ప్రయత్నం చేయండి. దీని ద్వారా వ్యక్తీకరణకు ఒక అందం వస్తుంది. మీ స్థాయిలో ఈ ప్రయత్నం సరిపోతుంది.



విద్య+ఆలయము = విద్యాలయము 
సచివాలయం = సచివ+ఆలయం (అ+ఆ=ఆ)
దిశాంచలము = దిశ+అంచలములు (అ+అ=ఆ)
శ్రావణాభ్రము = శ్రావణ+అభ్రము (అ+అ=ఆ)
దేవాలయాలు=దేవ+ఆలయాలు (అ+ఆ=ఆ)
అశ్వారూఢుడు=అశ్వ+ఆరూఢుడు (అ+ఆ=ఆ)
రాజాజ్ఞ=రాజ+ఆజ్ఞ (అ+ఆ=ఆ)
పుణ్యాంగన=పుణ్య+అంగన (అ+అ=ఆ)
మునీశ్వర = ముని+ఈశ్వర (ఇ+ఈ=ఈ) 
నవ+ఉదయం=నవోదయం (అ+ఉ=ఓ)
దేవ+ఋషి=దేవర్షి (అ+ఋ=అర్)
గర్వోన్నతి = గర్వ+ఉన్నతి (అ+ఉ=ఓ)
వదాన్యోత్తముడు = వదాన్య+ఉత్తముడు (అ+ఉ=ఓ) 
రామ్యోద్యానములు = రమ్య+ఉద్యానములు (అ+ఉ=ఓ)
అత్యంతము = అతి+అంతము (ఇ+అ=య)  
అత్యద్భుతం = అతి + అద్భుతం (ఇ+అ=య)
అభ్యాగతులు = అభి+ఆగతులు (ఇ+ఆ=య) 
అణ్వాయుధాలు = అణు+ఆయుధాలు(ఉ+ఆ=వ) 
రసైక = రస + ఏక (అ + ఏ = ఐ)
ఏకైక = ఏక+ఏక(అ + ఏ = ఐ)
వసుధైక = వసుధ+ఏక (అ + ఏ = ఐ)
దివ్యైరావతం = దివ్య + ఐరావతం (అ + ఐ = ఐ)
దేశైశ్వర్యం = దేశ+ఐశ్వర్యం (అ + ఐ = ఐ)
అష్టైశ్వర్యాలు = అష్ట+ఐశ్వర్యాలు (అ + ఐ = ఐ)
ఘనౌషధి = ఘన + ఓషధి (అ + ఓ = ఔ)
వనౌషధి = వన+ఔషధి (అ + ఓ = ఔ)
మహౌషధి = మహా+ఔషధి (అ + ఓ = ఔ)
 రసౌచిత్యం = రస + ఔచిత్యం (అ + ఔ = ఔ)
 దివ్యౌషధం = దివ్య+ఔషధం (అ + ఔ = ఔ)
 నాటకౌచిత్యం = నాటక+ఔచిత్యం (అ + ఔ = ఔ)
ఉత్త్వ/ఉకార సంధి:
సూత్రం: “ఉత్తునకు సంధి నిత్యం”. ఉత్తునకు అచ్చు పరమైతే సంధి తప్పక జరుగుతుంది.
ఉత్తు: హ్రస్వమైన ఉ. నిత్యం: ఎల్లప్పుడూ తప్పక జరుగును
మనము+ఉంటిమి=మనముంటిమి.
జగమెల్ల = జగము+ఎల్ల
సయ్యాటలాడెన్ = సయ్యాటలు+ఆడెన్
ధరాతలమెల్ల = ధరాతలము+ఎల్ల
ప్రపంచమంతా = ప్రపంచము+అంతా
నీరవుతుంది = నీరు + అవుతుంది
ఎత్తులకెదిగిన = ఎత్తులకు + ఎదిగిన
పేరవుతుంది = పేరు + అవుతుంది 
ఇత్త్వ/ఇకార సంధి: “ఇత్తునకు సంధి వైకల్పికముగానగు”. ఏమ్యాదులందు ఇత్తునకు అచ్చు పరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది.
వచ్చితిమి+ఇప్పుడు = వచ్చితిమిప్పుడు .
దారినిచ్చిరి = దారిని+ఇచ్చిరి
మేన+అల్లుడు=మేనల్లుడు. 
మేనత్త = మేన+అత్త
పూచెను+కలువలు=పూచెనుగలువలు
మూటఁగట్టు = మూటన్+కట్టు 
పూచెనుగలువలు = పూచెను+కలువలు 
వాడు+కొట్టె=వాడుగొట్టె
నాల్కలుసాచు = నాల్కలు+చాచు
ప్రాణాలు గోల్పోవు = ప్రాణాలు+కోల్పోవు 
ఆసువోయుట = ఆసు+పోయుట
కాలుసేతులు = కాలు+చేతులు
చక్రపాణి = చక్రము పాణి యందు గలవాడు.
వ్యవధికరణం: విభక్తులతో కూడిన పదాలకు మీదిపదం పదంతోడి సమాసాన్ని వ్యవధికరణం అంటారు. విగ్రహవాక్యంలో విభక్తి ప్రత్యయాలను చేర్చవలసి వస్తే మొదటి పదం చివర ఏ విభక్తి అనుకూలిస్తుందో ఆ విభక్తి పేరుతో ఈ సమాసాన్ని పిలుస్తారు. పూర్వపదం చివరవుండే విభక్తిని బట్టి వాటిని ఆయా విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలుగా గుర్తిస్తారు.

ప్రత్యాలు

విభక్తులు

డు, ము, వులు

ప్రథమా విభక్తి

నిన్, నున్, లన్, గూర్చి, గురించి

ద్వితీయా విభక్తి

చేతన్, చేన్, తోడన్, తోన్

తృతీయా విభక్తి

కొఱకున్ (కొరకు), కై

చతుర్ధీ విభక్తి

వలనన్, కంటెన్, పట్టి

పంచమీ విభక్తి

కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్

షష్ఠీ విభక్తి

అందున్, నన్

సప్తమీ విభక్తి

ఓ, ఓరీ, ఓయీ, ఓసీ

సంబోధనా ప్రథమా విభక్తి



పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు గురు లఘువులు, గణాలు, యతులు, ప్రాసలు మొదలైన వాటి గురించి తెలియజెప్పేది ఛందస్సు. పాదాది నియమాలు కలిగిన పద్య లక్షణాలను తెలుపునది చందస్సు. తెలుగు ఛందస్సు, సంస్కృత ఛందస్సు పై ఆధార పడి అభివృద్ధి చెందింది. పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట  సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు
ఛందస్సు ద్విసంఖ్యామానంపై ఆధారపడి ఉంది. 
ఛందస్సులో రెండే అక్షరాలు. గురువు, లఘువు. 
గురువుని U తోటీ, లఘువుని I తోటీ సూచిస్తారు.
ఏకమాత్ర(రెప్పపాటు) కాలంలో పలుకబడేది లఘువు. 
ద్విమాత్రాకాలంలో పలుకబడేది గురువు. 
రెండుకంటే ఎక్కువ మాత్రల కాలంలో పలుకబడే అక్షరాలను ప్లుతం అంటారు.
ఒక లిప్త కాలము తీసుకొను వాటిని లఘువు అని, రెండు లిప్తల కాలము తీసుకొను వాటిని గురువు అని అంటారు.
దీర్ఘాలన్నీ గురువులు. (ఉదా: పాట = U I)
"ఐ", "ఔ" అచ్చులతో కూడుకున్న అక్షరాలు గురువులు. (ఉదా: ఔనులో "ఔ"గురువు, "సైనిక్"లో "సై"గురువు)
ఒక సున్నా, విసర్గలు ఉన్న అక్షరాలు అన్నీ గురువులే. (ఉదా: “అంగడి”లో సం గురువు, “దుఃఖము”లో దుః అనునది గురువు)
సంయుక్తాక్షరం లేదా ద్విత్వాక్షరం ముందున్న అక్షరం గురువు. (ఉదా: “అమ్మ”లో అ గురువు, “సంధ్య”లో భ గురువు). ఇది సాధారణంగా ఒకే పదంలోని అక్షరాలకే వర్తిస్తుంది. 
ఋ అచ్చుతో ఉన్న అక్షరాలూ, వాటి ముందరి అక్షరాలూ (కృ, మొదలగున్నవి ) లఘువులు మాత్రమే.
ర వత్తు ఉన్నప్పటికీ దాని ముందు అక్షరములు కొన్ని సందర్భములలో లఘువులే! అద్రుచులోని అ లఘువు, సక్రమలో స గురువు. అభ్యాసము ద్వారా వీటిని తెలుసుకొనవచ్చు.
పొల్లుతో కూడిన అక్షరాలు గురువులు. (ఉదా: "పూచెన్ గలువలు"లో "చెన్"గురువు.)
హ్రస్వాలు
హ్రస్వద్విత్వాలు
హ్రస్వసంయుక్తాలు
దీర్ఘాలు
ఐ, ఔ లతో కూడిన హల్లులు
సున్నతో కూడిన అక్షరాలు
విసర్గతో కూడిన అక్షరాలు
పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు
ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు
సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలు
లలము                   - II    ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
లగము (వ గణం)     - IU   ఉదా: రమా
గలము (హ గణం)    - UI   ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
గగము                   - UU  ఉదా: రంరం, సంతాన్
ఉపగణాలున = న = III
హ = గల = U
భ = UII
ర = UIU
త = UUI
న గము = IIIU
స లము = IIUI
న లము = III
భల = UIII
భగరు = UIIU
తల = UUII
తగ = UUIU
మలఘ = UUUI
నలల = IIIII
నగగ = IIIUU
నవ = IIIIU
సహ = IIUUI
సవ = IIUIU
సగగ = IIUUU
నహ = IIIUI
రగురు = UIUU
నల = IIII
పాదం: పద్యమునందలి యొక చరణము. పద్యములో నాలుగవభాగము.
యతి: పద్యవిశ్రమస్థానము. ఛందస్సులో విరామ స్థానము. త్రి
ప్రాస: పద్యపాదమున రెండవ యక్షరము. పాదమందలి మొదటి అక్షరమునకు, య తిమై స్థానములోనున్న అక్షరమునకు యతి కుదుర్చుట.
ప్రాస యతి: ప్రాసస్థాన అక్షరానికి యతిని పాటించడం.  పద్య పాదంలో రెండవ అక్షరానికి సాధారణ యతిమైత్రి స్థానంలోని తరువాటి అక్షరానికి యతిని పాటించడం ప్రాసయతి అంటారు.
వృత్త పద్య లక్షణాలు:
ద్విపద తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి. 
ఈ పద్యానికి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి. అందుకే దీనిని ద్విపద అంటారు.
ప్రతిపాదములోనీ మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణము ఉంటుంది.
మూడవ గణం యొక్క మొదటి అక్షరం. 
ప్రాస ఉన్న ద్విపదను సామన్య ద్విపద, ప్రాస లేని ద్విపదను మంజరీ ద్విపద అని అంటారు.
తేటగీతిలో నాలుగు పాదాలుంటాయి.
ప్రతిపాదంలో వరుసగా ఒక సూర్యగణం, రెండు ఇంద్ర గణాలు, రెండు సూర్యగణాలు ఉంటాయి.
ఒకటోవ గణం మొదటి అక్షరానికి నాలుగో గణంలో మొదటి అక్షరం యతి మైత్రి.
ప్రాసయతి ఉన్న పద్యాన్ని అంతరాక్కరగా పిలుస్తారు.కాని అన్ని అంతరాక్కరలు తేటగీతులు కావు.
ప్రాస నియమం లేదు.
ప్రతి పాదానికి ఐదు గణాలు ఉన్నాయి.
1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉన్నాయి.
2, 4 పాదాల్లో ఐదు సూర్యగణాలు ఉన్నాయి.
ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరం యతి చెల్లింది.
ప్రాస నిమయం లేదు.
ప్రాసయతి చెల్లును.
ప్రతిపాదంలో ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
పద్యపాదం రెండు సమభాగాలుగా ఉంటుంది.
రెండు భాగాల్లోను మూడో గణంలోని మొదటి అక్షరం యతి లేదా ప్రాస యతి.
1వ గణంలో మొదటి అక్షరానికి 3వ గణంలో మొదటి అక్షరంతోను, 5వ గణంలో మొదటి అక్షరానికి 7వ గణంలో మొదటి అక్షరంతోను మైత్రి కుదరాలి.
ప్రాస నియమం లేదు. ప్రాసయతి ఉండ వచ్చు. అంటే పై సూత్రంలో చెప్పిన గణాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి బదులు రెండో జత అక్షరాలు ప్రాసలో ఉండవచ్చు. ఒకే అక్షరం అయి ఉండాలి (ఏ గుణింతమైనా సరే) 
తేటగీతి లేదా ఆటవెలది దీనికి చివరగా ఉంటుంది.
ఇందులో నాలుగు పాదాలుంటాయి.
హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
హిమాలయ పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి. కాని అవి నిజంగా ఆకాశాన్ని తాకవు. 
కాని వాటిని ఎక్కువచేసి చెప్పడంవల్ల 'ఆకాశాన్ని తాకుతున్నాయి' అని అంటున్నాము.
కం.
చుక్కలు తల పూవులుగా

మా ఊర్లో సముద్రమంత చెరువు ఉన్నది.
అభిరాం తాటి చెట్టంత పొడవు ఉన్నాడు..
శివాజీ ఎర్రబడిన కన్నులతో అదిరిపడే పై పెదవితో ఘనహుంకారముతో కదలాడే కనుబొమ్మ ముడితో గర్జిస్తూ 
పై వాక్యంలో కన్నులు ఎర్రబడటం, పై పెదవి అదరడం, గట్టిగా హుంకరించడం, కనుబొమ్మ ముడి కదలాడటం 
కోపంగా ఉన్నప్పుడు కలిగే స్వభావాలు. ఇట్లా ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం కూడా ఒక అలంకారమే. 
దీన్ని 'స్వభావోక్తి’ అలంకారం అంటారు.
“నీటిలో పడిన తేలు తేలుతదా!”
అరటితొక్క తొక్కరాదు.
నిప్పులో పడితే కాలు కాలుతుంది.
తమ్మునికి చెప్పు! చెప్పు తెగిపోకుండా నడువుమని.
నీకు వంద వందనాలు
నగారా మోగిందా
తెలుగు జాతికి అభ్యుదయం 
కొందరికి రెండు కాళ్ళు 
రంగదరాతిభంగ; ఖగరాజతురంగ; విపత్పరంపరో 
అడిగెద నని కడువడిఁ జను
రాజు రివాజులు బూజు పట్టగన్
గడ గడ వడకుచు తడబడి జారిపడెను. 
ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు.
బతుకాటలో గెలుపు ఓటములు సహజం.
వానజాణ చినుకుపూలను చల్లింది.
నవ్వులనావలో తుళ్ళుతూ పయనిస్తున్నాం.
అజ్ఞానాంధకారం తొలిగితే మంచిది.
నగరారణ్య హోరు నరుడి జీవనఘోష.
ఒకే శబ్దం రెండు వేర్వేరు అర్థాలనందిస్తున్నది. (విభిన్న అర్థాలు ఆశ్రయించి ఉన్నాయి.) 
విభిన్న అర్థాలను కలిగి ఉండే పదాలుంటే దానిని 'శ్లేషాలంకారం' అని అంటారు.
మిమ్ముమాధవుడు రక్షించుగాక!
  1. మిమ్ము మాధవుడు (విష్ణువు) రక్షించుగాక! 
  2. మిమ్ము ఉమాధవుడు (శివుడు) రక్షించుగాక!
మానవ జీవనం సుకుమారం.
  1. మా నవ (ఆధునిక) జీవనం సుకుమారమైంది.
  2. మానవ (మనిషి) జీవనం సుకుమారమైంది.
రాజు కువలయానందకరుడు.
నీవేల వచ్చెదవు.
మావిడాకులు తెచ్చివ్వండి.
వాడి కత్తి తీసుకోండి.
ఆమె లత పక్కన నిలుచున్నది.
అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు. అంబటిపూడి వెంకటరత్నం అచ్చువేయించాడు.
గడియారం రామకృష్ణశర్మ మంచి పాండిత్యం సంపాదించాడు. గడియారం రామకృష్ణశర్మ అనేక సన్మానాలు పొందాడు.
కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించాడు. కర్ణసుందరి నాటకాన్ని ప్రచురించాడు.

నల్గొండ జిల్లాలో ఎందరో కవులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో కథకులూ ఉన్నారు. 
నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. నమాజు చదివి ఎందరో పోతుంటారు. 
తెలుగువాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి. వాటిని మనం భద్రపరుచుకోవడం లేదు.
తిరుమల రామచంద్రగారు సంస్కృత, ఆంధ్రభాషలలో పండితుడు.
నేనొకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.
ఇంట్లో మాట్లాడే భాష, బడిలో చదివే భాష వేరువేరు.
ఒక వాక్యంలో క్రియ, కర్తను సూచిస్తే అది కర్తరి వాక్యం, కర్మను సూచిస్తే కర్మణి వాక్యం. 
ఆళ్వారుస్వామి 'చిన్నప్పుడే' అనే కథ రాశాడు. (కర్తరి) 
పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మసహాని 'తమస్' నవలలో చిత్రించాడు. 
హైదరాబాద్ రాష్ట్ర చరిత్రను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేశారు.
నెల్లూరి కేశవస్వామిని భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకడిగా కీర్తించారు.
ఒకరు చెప్పిన మాటలు / వాక్యాలను చెప్పింది చెప్పినట్లే రాయాలి. ఆ మాటలకు / వాక్యాలకు ఉద్ధరణ చిహ్నాలు (“ “) ఉండాలి.
ప్రథమపురుషలో ఉన్న పదాలు (అనగా తమను, తమ, తాను, తాము వంటి పదాలు) ఉత్తమ పురుషలోనికి నేను, మేముగా మారుతాయి.
"అక్కా! ఆ చెరువు జూడు.”
"నేను రాన్రా తమ్ముడు. ".
"పిల్లలూ! రేపు బీర్పూరు జాతరకు వెళుతున్నాను.”
"మేమూ వస్తాం సర్.”
"మనుషులంతా పుట్టుకతో సమానం, ఎవరూ ఎక్కువకాదు, ఎవరూ తక్కువ కాదు" అన్నాడు భాగ్యరెడ్డి వర్మ.
రుద్రమదేవితో తల్లి నారాంబ “నువ్వు నేను మామూలు స్త్రీలం కాదు. నువ్వు పట్టమహిషివి, నేను భావి చక్రవర్తిని, మనకు కండ్లు మటుకే ఉండాలి కాని కన్నీళ్ళు ఉండకూడదు" అన్నది.
రాజకీయపార్టీల వారు “జనానికి తక్షణం కావల్సింది కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర" అని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు.
“సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది" అని నెహ్రూ అన్నాడు.
"హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైంది" అని సర్దార్ వల్లభభాయ్ పటేల్ ప్రకటించాడు.
"తెలుగు కథాసాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కథకుల్లో ఒకరు నెల్లూరి కేశవస్వామి” అని గూడూరి సీతారాం అన్నాడు.
“చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుంది" అని డి. రామలింగం పేర్కొన్నాడు.
ఇవి సూటిగా వాళ్లే చెప్తున్నట్లు కాకుండా! ఇంకొకళ్ళు చెప్తున్నట్లున్నాయి కదా!
ఇలాంటి వాక్యాలను "పరోక్ష కథనం"లో ఉన్న వాక్యాలు అంటారు.
వీటిలో ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించవలసిన అవసరం లేదు.
పరోక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నాలు తొలగించి “అని” చేరుస్తారు.
ఉత్తమ పురుష పదాలు నేను, మేము, నా, మా వంటివి. ప్రథమ పురుష పదాలుగా తాను, తాము, తన తమ లుగా మారుతాయి.
పాఠంలోని పరోక్ష వాక్యాలను గుర్తించండి. వాటిని ప్రత్యక్ష కథన వాక్యాలుగా మార్చండి.


పాఠాలలోని విషయాలను సమర్థిస్తూ, విశ్లేషిస్తూ సొంతమాటల్లో రాయాలి.

అన్ని ప్రశ్నలకు సొంతంగా జవాబులు రాయగల సామర్థ్యాన్ని పెంచుకోవాలి.

రాయాల్సిన అన్ని ప్రశ్నలకు సమాధానం రాయాలి.కంఠస్థ పద్యాలు, భావాలు, కవి పరిచయాలు, సారాంశాలు, రామాయణం, నినాదాలు, సూక్తులు, వ్యాసం, లేఖ, సంభాషణ, కథ, వచన కవిత మొదలైనవాని వివరణ. పదజాల, వ్యాకరణాంశాలు అన్ని ముఖ్యమైన టాపిక్స్ కవర్ చేయబడ్డాయి.  (ఆవరేజ్ స్టూడెంట్స్ దీన్ని చదివి అవగాహన పెంచుకుంటే 100% పాస్) 


10/10 ను నిర్ణయించే పదజాల, వ్యాకరణాంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. కంఠస్థ పద్యాలను, కవిపరిచయాలు ఇవ్వడం జరిగింది.                 


🔊 Dear STUDENTS……. All the Best……. 🖋 ✍


By.... Rajendra

10వ తరగతి స్టడీ మెటీరియల్

Quick Links:

  1. https://www.pravahini.in/2022/02/ts-10th-fl-telugu-model-paper-2022.html

  2. https://www.pravahini.in/2022/04/ssc-public-exam-telugu2022.html
  3. https://www.pravahini.in/2022/04/1oth-public-exams-telugu-first-language.html
  4. https://www.pravahini.in/2022/04/SSC-Telugu-QuickRevision-Study-Material-SSC%20PublicExaminations-May2022.html
  5. https://www.pravahini.in/2022/05/10th-in-ten-pages-May2022.html
  6. https://www.pravahini.in/2022/05/quick-links-10th-class-telugu.html
  7. https://www.pravahini.in/2022/04/10th-telugu-padajalam-quick-revision.html
  8. https://www.pravahini.in/2022/02/10thTSfl.html
  9. https://www.pravahini.in/2022/02/10th-fl-ts.html
  10. https://www.pravahini.in/2022/02/10-fl-ts.html




0/Post a Comment/Comments